పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఆట న్యూ సీజన్...యాంకర్ సుధీర్
on Jan 25, 2026
ఆట డాన్స్ షో అంటే ఒక ఎమోషన్. ఈ షో 2 .0 త్వరలో స్టార్ట్ కాబోతోంది. దీని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. హోస్ట్ గా సుధీర్ రాబోతున్నాడు. ఇక సుధీర్ ఈ ప్రోమోలో మాస్ లుక్ లో కనిపించాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో అన్నయ్య అన్నయ్యా అన్నయ్య అనగానే యాంకర్ ఓంకార్ ప్లీజ్ వెల్కమ్ అంటూ మంచి జోష్ తో పిలిచాడు. బిట్టు బిట్టు, సూపర్ రా, సూపర్ రా, థాంక్యూ అన్నయ్య, సు.సు.సు.సూపర్ రా అంటూ ఉంటే సుధీర్ కళ్ళజోడు తియ్యడం పెట్టడం వంటివి చేస్తూనే ఉన్నాడు. ఆట ఒక కాంపిటీషన్ కాదు ఇది ఒక ఎమోషన్. ఆట మెమోరీస్ ఇప్పటికీ మనకు మెలోడీస్ లా వినిపిస్తూనే ఉన్నాయ్. ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఈ రోజుకు తగ్గట్టుగా మాసు, గ్రేసు, సరికొత్త స్పేసు..ఆట ఈజ్ బ్యాక్..అన్నయ్య మీ బ్లేసింగ్స్ కావాలన్నయ్యా అంటూ అడిగేసరికి ఆల్ ది బెస్ట్ అన్నాడు ఓంకార్..థాంక్యూ అన్నయ్యా అంటూ బాక్గ్రౌండ్ వాయిస్ వినిపించింది. త్వరలో రాబోతోంది అంటూ చెప్పాడు సుధీర్. కొణిదెల నిహారిక సొంత ప్రొడక్షన్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఆట న్యూ సీజన్ రాబోతోంది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. "ఓంకార్ ఎందుకు హోస్ట్ గా కనిపించలేదు. ఆయన లేకపోతె ఈ ఆట షో ఫ్లేవర్ మిస్సవుతాం. ఇక జడ్జెస్ ఎవరు ? అనిల్ రావిపూడినా ? సుధీర్ అన్న ఎక్కడ ఉంటే అక్కడ ఆ షో సూపర్ హిట్ ఇంక టీఆర్పి రేటింగ్ పీక్స్..సుధీర్ అన్న జీ తెలుగులోకి డ్రామా జూనియర్స్ షో వచ్చి హిట్ కొట్టాడు, తర్వాత సరిగమప లిటిల్ చాంప్స్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఆట డాన్స్ షో " అంటూ సుధీర్ మీద అభిమానాన్ని చాటుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



