Karthika Deepam2 : శ్రీధర్ మాటలకి చొక్కా పట్టుకున్న కార్తీక్.. బోరున ఏడ్చేసిన దీప!
on Apr 4, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -322 లో.. దీప ఇంటికి రాగానే కార్తీక్ ఎక్కడికి వెళ్ళావంటూ అడుగుతాడు. తనెందుకు చెప్తుంది.. నేను చెప్తానంటూ శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. నువ్వెందుకు వచ్చావ్.. అర్జెంట్ గా ఇల్లు ఖాళీ చెయ్యాలి.. ఎప్పుడు ఈ దరిద్రం ఏంటోనని శ్రీధర్ ని చూసి కార్తీక్ చిరాకుపడతాడు. మార్చాల్సింది ఇల్లు కాదు.. ఇల్లాలిని అని శ్రీధర్ అంటాడు. దాంతో కార్తీక్ శ్రీధర్ చొక్కా పట్టుకుంటాడు. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళండి అని శ్రీధర్ తో కార్తీక్ అంటాడు. నీ భార్య ఎక్కడి నుండీ వచ్చిందో తెలుసా. శివన్నారాయణ ఇంటి నుండి అని శ్రీధర్ అనగానే కార్తీక్, కాంచన షాక్ అవుతారు.
నా భార్య వాళ్ళింటికి వెళ్ళదని కార్తీక్ చెప్తాడు. నీ భార్య గౌతమ్ మంచివాడు కాదని ఒక అమ్మాయి ని తీసుకొని వెళ్లి తన కడుపులో పెరిగే బిడ్డకి గౌతమ్ తండ్రి అని డబ్బు ఇచ్చి చెప్పించాలని చూసింది కానీ ప్లాన్ ఫెయిల్ అయింది. తన భర్త వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. ఇక అక్కడున్న వాళ్ళు ఊరుకుంటారా దీపని కుక్క తిట్లు తిట్టారని శ్రీధర్ చెప్పగానే దీప ఏడుస్తుంది.
నాకు ఇప్పుడు అర్ధమైంది అమ్మ తనది ఏ తప్పు లేదని నిరూపించుకోవాలనుకుంది కానీ మళ్ళీ అక్కడే ఏదో తప్పు జరిగిందని కాంచనతో కార్తీక్ అంటాడు.ఆ తర్వాత రాత్రి కార్తీక్ సరుకులు తీసుకొని ఇంటికి వస్తాడు. ఎక్కడ చూసినా దీప కన్పించదు. ఒక దగ్గర కూర్చొని బాధపడుతుంటే దీప దగ్గరికి వెళ్తాడు కార్తీక్. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. ఆ గౌతమ్ గాడే ఇలా చేసాడని దీప అంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళిన విషయం మా నాన్నకి తెలుసు ఆయనే గౌతమ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడని కార్తీక్ అంటాడు. శ్రీధర్ గారికి నాపై కోపం.. స్వప్న, కాశీల పెళ్లి చేసాను. తన రెండో పెళ్లి గురించి బయటపెట్టానని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
