Karthika Deepam2 : దీప చేసిన ఆ పనికి పెళ్ళి ఆగిపోయింది.. బంధం తెంచుకున్నట్టేనా!
on Oct 1, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -163 లో..... కావేరిని కాంచన ఇంటికి రప్పిస్తుంది. తనకి చీర ఇస్తుంది. ఆ తర్వాత బ్యాగ్ శ్రీధర్ కి ఇచ్చి.. ఏం చేసిన ఒప్పుకుంటానని అన్నారు కదా.. ఇక కావేరిని తీసుకొని ఇక్కడ నుండి వెళ్లిపోండి అని కాంచన చెప్పగానే.. కావేరిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు శ్రీధర్. అతను వెళ్లిపోతుంటే కాంచన ఏడుస్తుంది. కార్తీక్ బాధపడతాడు. అక్కడున్నా దీప.. కాంచనకి దైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరొకవైపు స్వప్న, కాశీ లని దాస్ తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆడపడుచు ఉంటే ఇప్పుడు మిమ్మల్ని సరదాగా ఆటపట్టించే వాళ్లని దాస్ అంటాడు. దీప వుంది కదా తను కాశీని సొంత తమ్ముడు లాగా చూస్తుందని స్వప్న అంటుంది.
ఆ తర్వాత దాస్ వాళ్లకు హారతి ఇచ్చి ఆహ్వానిస్తాడు. మరుసటి రోజు శ్రీధర్ చేసిన నమ్మకద్రోహాన్ని గుర్తుచేసుకుంటుంది కాంచన. ఈ విషయం దీపకి తెలిసిన చెప్పలేకపోయింది. మరి నువ్వు ఎందుకు చెప్పలేదు. మీ అమ్మ మోసపోనివ్వు అనుకున్నావా అని కాంచన కార్తీక్ ని అడుగుతుంది కాంచన. అప్పుడే శివన్నారాయణ దశరథ్ లు కాంచన ఇంటికి వస్తారు. కూర్చోండి నాన్న అని కాంచన అనగానే.. మర్యాద కోసం రాలేదు దశరథ్ కి ఇచ్చిన మాట చెప్పు అని శివన్నారాయణ అంటాడు. నీకు కూతురు ఉంటే అక్రమ సంబంధం పెట్టుకున్న ఇంటికి కోడలుగా ఇస్తావా అని దశరథ్ అంటాడు. నాకు అర్ధం అయింది. మొన్న కార్ కొనాలి అనుకున్న ఆ కార్ కొనాలి అంటే ఫ్యామిలీ గురించి వెరిఫికేషన్ చేస్తారమ్మ అన్నాడు. కార్ విషయం లోనే అలా ఉంటే ఇక నీ కూతురు జీవితం విషయంలో ఇంకా ఎలా ఆలోచిస్తారని కాంచన అంటుంది.
ఆ తర్వాత నా కొడుకుకి నీ కూతురికి పెళ్లి జరగదు.. మాట తీసుకున్నా.. ఇప్పుడు మాటది ఏముందని కాంచన బాధపడుతుంది. సంబంధం మాత్రమే వద్దని అనుకున్నారా.. నాతో బంధం వద్దని అనుకున్నారా అని కాంచన ఎమోషనల్ అవుతుంటే.. వచ్చిన పని అయిపోయిందంటూ ఇద్దరు వెళ్ళిపోతారు. మరొకవైపు దీప ఇంటికి వస్తుంది. నువ్వు అనుకున్నది చేసావ్ కదా.. ఇక్కడ నీకు అవసరం లేదు.. వెళ్లి మా బావ దగ్గర ఉండమని జ్యోత్స్న అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ జ్యోత్స్న అని దీప కోప్పడుతుంది. చిన్నప్పటి నుండి బావ నా భర్త అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు అది జరగకుండా చేసావని జ్యోత్స్న అంటుంది. అప్పుడే పారిజాతం వచ్చి.. నువ్వు చేసిన పనికి జ్యోత్స్న పెళ్లి ఆగిపోయిందని అంటుంది. దీప షాక్ అవుతుంది. నీ పెళ్లి ఎందుకు ఆగిపోతుంది. తప్పు చేసింది మీ మావయ్య కదా అని దీప అనగానే.. మా తాతయ్య వెళ్లి తప్పు చేసిన ఇంటి నుండి సంబంధం వద్దని చెప్పారట.. ఇక ఈ పెళ్లి జరగదని జ్యోత్స్న అంటుంది. దాంతో దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read