Brahmamudi : భార్యాభర్తల మధ్య పోటీ.. గెలిచేదెవరంటే!
on Oct 2, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -529 లో....కళ్యాణ్ ఆటో నడుపుతున్న విషయం అప్పుకి తెలుస్తుంది. దాంతో కళ్యాణ్ పై కోపంగా అప్పు ఇంటికి వెళ్తుంది. మరొకవైపు రాజ్ మరియు స్టాఫ్ అందరు డిజైన్స్ వేస్తుంటారు. స్టాఫ్ అందరు ఒక్కొక్కరుగా అందరు ఇంటికి వెళ్తుంటారు. శృతి మాత్రం రాత్రి అయిన డిజైన్స్ ట్రై చేస్తూనే ఉంటుంది. అలాగే నిద్రపోతుంది.. ఆ తర్వాత కావ్య భోజనం చేస్తుంటుంది. అప్పుడే తన బాస్ రేపు జరగబోయే డిజైన్ ఎక్స్పోకి మీరు రావాలి.. అక్కడ అందరికి పరిచయం చేస్తానని అంటాడు.
ఆ తర్వాత ఎప్పుడు ఆ పోటీలో మా ఆయనకే అవార్డు వస్తుంది. ఆయన ఖచ్చితంగా అక్కడకి వస్తారు. నేను ఎదరుపడలేనని మనసులో అనుకోని నాకు వర్క్ ఉంది రాలేనని కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఎందుకు వెళ్ళనని అంటున్నావని కనకం అడుగుతుంది. వాళ్లు కూడా వస్తారని కావ్య అనగానే.. అల్లుడు గారిని చూడగానే కరిగిపోయి మాట్లాడుతావనే భయంతో వెళ్లట్లేదు కదా అని కనకం అంటుంది. అంత సీన్ లేదు. ఆయన చేసిన పనికి తను వచ్చి బ్రతిమిలాడినా నేను వెళ్ళను. నువ్వు అంటున్నావ్ కాబట్టి నేను రేపు ఎక్స్పో కి వెళ్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ డిజైన్స్ వేసి శృతి దగ్గరకి వస్తాడు. తనని లేపి డిజైన్స్ అన్ని రేపు ఎక్స్పో కి సిద్ధంగా ఉండాలని డిజైన్స్ ఇస్తాడు. మరొక వైపు అనామికకి రుద్రాణి ఫోన్ చేస్తోంది. కావ్య డిజైన్ మేమ్ తీసుకున్నాం.. ఇక రేపు రాజ్ కి పోటీగా తన భార్య ఉండబోతుందని అనామిక చెప్పగానే రుద్రాణి సంబరపడుతుంది. రుద్రాణి వెనకాల స్వప్న ఉండి తన మాటలు వింటుంది. మా అత్త ఏదో ప్లాన్ చేసినట్లుంది. ఎందుకైనా మంచిది నేను రేపు ఎక్స్పో కీ వెళ్ళాలని స్వప్న అనుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఇంటికి వస్తాడు. నన్ను మోసం చేసావంటూ అప్పు బాధపడుతుంది. మనం బ్రతకడానికి మాత్రమే చేస్తున్నానని అప్పుకి అర్థం అయ్యేలా చెప్తాడు కళ్యాణ్.
మరుసటి రోజు కావ్య ఎక్స్పో కి వెళ్తుంటే.. అల్లుడు ఎదరుపడితే కూల్ గా మాట్లాడమని కనకం చెప్తుంది. ఆయన కూల్ గా మాట్లాడితే నేను మాట్లాడతానని కావ్య అంటుంది. మరొకవైపు రాజ్ ఎక్స్పో కి వెళ్తుంటే అపర్ణ పూజ చేసి హారతి ఇస్తుంది. అందరు ఆల్ ది బెస్ట్ చెప్తారు. ఆ తర్వాత నేను వస్తానని రుద్రాణి అనగానే అందరు షాక్ అవుతారు. నేను వస్తానని స్వప్న అంటుంది ఆ తర్వాత స్వప్న, రుద్రాణి, సుభాష్ , రాజ్ లు వెళ్తారు. ఈ ఇయర్ మనకే అవార్డు రావాలని సామంత్ టెన్షన్ పడతాడు. మనకే వస్తుంది కావ్య డిజైన్ చూసావ్ కదా అని అనామిక అంటుంది. రాజ్ కూడా తను అనుకున్నది సాధిస్తాడని సామంత్ అంటాడు. నువ్వు టెన్షన్ పడకని అనామిక అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read