Karthika Deepam 2 : సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్.. షాక్ లో కార్తీక్!
on Jan 3, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -557 లో... దీప తులసి చెట్టుకి దీపం పెడితే అది ఆరిపోతుంది. దాంతో దీప కంగారుపడుతుంది. అప్పుడే కార్తీక్ వచ్చి మాట్లాడతాడు. దశరథ్ వచ్చి.. ఒరేయ్ కార్తీక్ హాస్పిటల్ కి వెళదాం.. ఈ రోజు రిపోర్ట్స్ వస్తాయి. డాక్టర్ ఒక్కడినే రమ్మంది కానీ నాకు భయంగా ఉంది. అందుకే నిన్ను రమ్మంటున్నానని అనగానే కార్తీక్ సరే మావయ్య అని దశరథ్ వెంట వెళ్తాడు.
దశరథ్ టెన్షన్ పడుతూ సుమిత్రకి ఏం ప్రాబ్లమ్ లేదు కదా అని అడుగుతాడు. మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు. డాక్టర్ మీరు అతనికి బీపీ చెక్ చెయ్యండి అని డాక్టర్ తో దశరథ్ ని వెళ్ళమని ఇంకొక డాక్టర్ చెప్తుంది. దశరత్ తో కార్తీక్ వెళ్తుంటే.. మీరు ఆగండి అని డాక్టర్ చెప్తుంది. మా అత్తకి ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని కార్తీక్ అడుగుతాడు. ఉందని డాక్టర్ చెప్పగానే కార్తీక్ షాక్ అవుతాడు. మరొకవైపు పారిజాతం హాల్లో కూర్చొని దీపని కాఫీ తీసుకొని రమ్మంటుంది. దీప కాఫీ తీసుకొని రాగానే కావాలనే కాఫీ కప్పు కిందపడేస్తుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి కోప్పడతాడు. ఆ కాఫీ నువ్వే క్లీన్ చెయ్యమని చెప్తాడు. దాంతో తప్పక పారిజాతం క్లీన్ చేస్తుంది. ఆ దీప ఎందుకే ఏడుస్తుంది. ఎందుకంటావ్.. ఏదో జరుగుతుందని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది.
మరొకవైపు మీ అత్తకి ప్రాబ్లమ్ ఉంది. అది మీ మావయ్యకి చెప్తే తట్టుకోలేడని పంపించాను. మీ అత్తకి బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్ చెప్పగానే కార్తీక్ షాక్ అవుతాడు. రెండు రోజుల్లో అడ్మిట్ కావాలి.. ఇంకా టెస్ట్ లు ఉన్నాయి. అవి చేసాక ఏం చెయ్యాలో చెప్తానని డాక్టర్ చెప్తాడు. మీరు పేషేంట్ కి ఈ విషయం చెప్తే భయపడుతుంది. తనకి తెలియకుండా చూడండి అని డాక్టర్ చెప్తుంది. అప్పుడే దశరథ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఏం లేదు మావయ్య చిన్న ప్రాబ్లమ్ అని చెప్పి దశరథ్ ని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



