Karthika Deepam2 : దిగొచ్చిన శివన్నారాయణ.. కార్తీక్ చెప్తానన్న ఆ కండిషన్ ఏంటి!
on Aug 8, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -430 లో.....దీప మెడలో తాళిని జ్యోత్స్న తెంపడంతో జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది సుమిత్ర. మాట్లాడడానికి మంచి మనసు ఉండాలనుకుంటుంది నా భార్య.. కానీ మీరు స్థాయి ఉండాలని అనుకుంటారని చెప్పి దీపని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. ఎందుకు ఇలా చేసావ్ జ్యోత్స్న అని సుమిత్రతో పాటు ఇంట్లో అందరు జ్యోత్స్న పై విరుచుకుపడతారు.
నా మాట వినరా.. నేను చేసుకోవాల్సిన బావని అది చెసుకున్నానే గర్వంతో మాట్లాడుతుంది. నాకు పెళ్లి చేసుకోమని సలహా ఇస్తుందని జ్యోత్స్న చెప్తుంది. తప్పేంటి అని శివన్నారాయణ అంటాడు. నువ్వు చేసిన తప్పు చిన్నది కాదు అందుకు వాళ్ళకి క్షమాపణ అడగాలని చెప్పి సుమిత్ర అంటుంది. మనం వెళదాం పదండి అని దశరథ్ తో సుమిత్ర అనగానే నేను వస్తానని శివన్నారాయణ అంటాడు. ముగ్గురు కలిసి కాంచన దగ్గరికి వెళ్తారు. మరొకవైపు అసలు విషయం తెలిసి కాంచన బాధపడుతుంది. జ్యోత్స్న ని తిడుతుంది. అదే సమయంలో జరిగిందంతా శ్రీధర్ కి చెప్తుంది పారిజాతం. దాంతో శ్రీధర్ హ్యాపీగా ఫీల్ అవుతూ.. ఇక ఆ దీప నా కొడుకు జీవితంలో ఉండదని అనుకుంటాడు.
శివన్నారాయణ వాళ్ళు కాంచన ఇంటికి వెళ్తారు. నా కోడలు మెడలో తాళి తెంపుతుంటే అందరు చోద్యం చూస్తున్నారా అని వాళ్లపై కాంచన కోప్పడుతుంది. మా వల్ల తప్పు జరిగింది క్షమించమని అడగడానికి వచ్చామని సుమిత్ర అంటుంది. క్షమించంటే సరిపోతుందా అని కార్తీక్ అంటాడు. మరేం కావాలని శివన్నారాయణ అంటాడు. నాకొక కండిషన్ ఉంది దానికి మీరు ఒప్పుకోవాలని కార్తీక్ అంటాడు. ఒప్పుకుంటాం చెప్పమని శివన్నారాయణ అనగానే ఇప్పుడు చెప్పను రేపు మీ ఇంట్లో చెప్తానని కార్తీక్ అనగానే సరే అని వాళ్ళు వెళ్లిపోతారు. ఏం కండిషన్ రా అని కార్తీక్ ని అడుగుతుంది కాంచన. నీకు అక్కడే చెప్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



