Illu illalu pillalu : దొంగతనానికి వచ్చిన ఆనందరావుని చూసేసిన నర్మద.. ఆ ఇంటికి వెళ్ళాడుగా!
on Aug 8, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -231 లో..... శ్రీవల్లి వాళ్ళ నాన్న దొంగతనానికి వస్తున్నాడని తెలిసి శ్రీవల్లి గడియ పెట్టకుండా ఉంటుంది. లోపలికి వచ్చి ఎప్పటిలాగే పడుకుంటుంది. అప్పుడే తిరుపతి వాటర్ కోసం నిద్ర లేచి గడియ పెట్టలేదేంటనుకొని గడియ పెడుతాడు. అప్పుడే ఆనందరావు వచ్చి డోర్ తియ్యబోతుంటే డోర్ రాదు. దాంతో శ్రీవల్లికి ఫోన్ చేసి గడియ పెట్టారని అంటాడు.
శ్రీవల్లి వచ్చి నేను గడియ పెట్టలేదు కదా ఎవరు పెట్టారని గడియ తీస్తుంది. ఆ తర్వాత ఆనందరావు లోపలికి వెళ్తాడు. అదే సమయంలో ప్రేమ దగ్గరికి ధీరజ్ వస్తాడు. ఇద్దరు గొడవ పడుతుంటే ప్రేమ తన చేతిలో వస్తువు విసిరేస్తుంది. అది కాస్త ఆనందరావు గుండుకి తాకుతూంది. ఏదో కాలినట్లు వాసన వస్తుందనుకుంటాడు కానీ తీరా చూస్తే తన వెనకాల దోమలు బిళ్ల అంటుకుంటుంది. శ్రీవల్లి చెప్పిన ప్లేస్ కి వెళ్లి కీస్ తీసుకుంటాడు ఆనందరావు. మరోవైపు నర్మదతో సాగర్ మాట్లాడాలని ట్రై చేస్తుంటాడు. నర్మద కోపంగా వాటర్ కోసం బయటకు వస్తుంటే.. ఆనందరావు కర్టెన్ వెనకలా దాక్కుంటాడు. అతని కాళ్ళు కనిపించడంతో దొంగ దొంగ అంటూ నర్మద గట్టిగా అరవడంతో అందరు బయటకు వస్తారు.
శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఆనందరావు అందరు వచ్చేలోపే పారిపోతాడు. అతను పారిపోయి ఎదురుగా ఉన్న భద్రవతి ఇంట్లోకి వెళ్తాడు. హమ్మయ్య తప్పించుకున్నానని తనలో తాను మాట్లాడుకుంటుంటే.. ఎవరది అని భద్రవతి అంటుంది. దాంతో ఆనందరావు టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



