Karthika Deepam 2 : లేచిపోతామని చెప్పేసిన జ్యోత్స్న.. దీపని తిట్టిపోసిన ఆ ఇద్దరు!
on Oct 2, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam 2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -164 లో.....దీప ఇంటికి రాగానే ఇక నువ్వు అనుకున్నది జరిగింది కదా అంటూ జ్యోత్స్న తిడుతుంది. నీ వల్ల నా మనవరాలి పెళ్లి ఆగిపోయిందని పారిజాతం అంటుంది. దాంతో దీప షాక్ అవుతుంది. తాతయ్య వెళ్లి మీలాంటి కుటుంబంతో పెళ్లి సంబంధం వద్దని చెప్పి వచ్చారట అని జ్యోత్స్న ఏడుస్తుంది. జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కలిసి దీపని ఇష్టం వచ్చినట్లు తిడతారు. అప్పుడే సుమిత్ర వచ్చి.. శ్రీధర్ అన్నయ్య తప్పు చేసాడు దానికి దీప కారణమా.. పెళ్లి దీప చేయకుంటే స్వప్న, కాశీలు పెళ్లి చేసుకోలేరా అని దీపకి సపోర్ట్ గా సుమిత్ర మాట్లాడుతుంది. అయిన కూడ ఇద్దరు దీపని తప్పు పడతారు. ఏం జరిగినా దీపని అనడం అలవాటు అయిందని సుమిత్ర అంటుంది.
చిన్నప్పటి నుండి బావ నీ భర్త అని చెప్పడం మాది తప్పు.. అందుకు జ్యోత్స్న శిక్ష అనుభవిస్తుందని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత నన్ను ఈ సిచువేషన్ కి తీసుకొని వచ్చావని జ్యోత్స్న అంటుంటే.. తనని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది సుమిత్ర. ఆ తర్వాత కుటుంబంలో ఒక్కరు తప్పు చేస్తే అందరికి శిక్ష ఎందుకు.. ఉదాహరణ ఇదే అని దీప బాధపడుతుంది. మరొకవైపు కార్తీక్ కాంచనకి కాఫీ చేసుకొని వస్తాడు. ఒరేయ్ నువు మళ్ళీ లండన్ వెళ్ళురా నీతో పాటు నేను కూడా వస్తానని కాంచన అంటుంది. అక్కడ ఎవరున్నారని కార్తీక్ అనగా.. ఇక్కడ ఎవరన్నారని కాంచన అంటుంది. తన కుటుంబం నుండి కాంచన విడిపోయినందుకు చాలా ఫీల్ అవుతుంది. తాతయ్యకి మైండ్ ఉందా అలా చెయ్యడమేంటి అంటూ కార్తీక్ సీరియస్ అవుతాడు. ఆ సిచుయేషన్ లో నేనున్నా కూడా ఆలాగే చేసేదాన్ని అని కాంచన ఎమోషనల్ అవుతుంది.
మరొకవైపు జ్యోత్స్నకి సుమిత్ర కాఫీ తీసుకొని వస్తుంది. దాన్ని విసిరేస్తుంది. నాకు బావ కావాలి అంటు బాధపడుతుంది. అలాంటిది ఇంటికి ఇస్తే.. ఈ కుటుంబం పరువు ఏమవుతుందని శివన్నారాయణ అంటాడు. మీరు పెళ్లి చేయండి మేమ్ ఫారెన్ వెళ్తామని జ్యోత్స్న అంటుంది. మరి మేమ్ ఎక్కడికి వెళ్ళాలని శివన్నారాయణ అంటాడు. నేను బావ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటామని జ్యోత్స్న అంటుంది. అప్పుడు లేచిపోయింది అంటారని శివన్నారాయణ అంటాడు. అంటే అనుకోనియ్.. నాకు నా బావ కావాలని జ్యోత్స్న అంటుంది. నువ్వు స్వార్థపరుడివి తాతయ్య అని జ్యోత్స్న అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read