Bigg Boss 8 Telugu: యష్మీ బ్యాక్ బిచింగ్.. ఆదిత్య ఓం విన్!
on Oct 2, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇందులో గతవారం సోనియా ఎలిమినేట్ అయ్యింది. ఇక హౌస్ లో సోనియా స్థానాన్ని యష్మీ భర్తీ చేస్తుంది.
నిన్న జరిగిన టాస్క్ లు ఓ వైపు, యష్మీ మాటలు మరోవైపు ఆసక్తిని రేకెత్తించాయి. ఎంతలా అంటే యష్మీలోని నెగెటివ్ మొత్తం ఆడియన్స్ కి అర్థమైంది. ఈరోజు ఎపిసోడ్ మొదలుకాగానే యష్మీతో ప్రేరణ సరదాగా ఓ మాట అడిగింది. మణికంఠ, ఆదిత్యలో ఎవరికైనా ఈ వారం బయటికెళ్లడానికి టైమ్ వచ్చిందని అనుకుంటున్నావా? అని ప్రేరణ అడిగింది. దీనికి "అమ్మా వెళ్లాలిరా మణి.. ఇలాంటోళ్లు అసలు ఎన్ని వీక్స్ ఉంటాడు.. ఇది ఐదోవారం అయినా ఇంకా ఉన్నాడు.. ఎదుటివాళ్ల ఎమోషన్స్‌తో ఆడుకుంటూ.. నమ్మించి మోసం చేయడం.. ఇదేం గేమ్‌రా.. ఆయన్ని చూస్తేనే నాకు కోపం వస్తుందంటూ యష్మీ రెచ్చిపోయింది. నువ్వు వాడిని గ్రేట్ ఫ్రెండ్ అన్నావు కదా అంటూ ప్రేరణ అడిగితే.. నమ్మాను ఫ్రెండ్ అని, పాపం నాలాగా బ్యాడ్ స్టోరీ ఉందని సపోర్ట్ చేయాలని కానీ చాలా డేంజరస్, క్రిమినల్ ఫేస్ ఉందని నేను అనుకోలేదంటూ యష్మీ అంది.
ఇక ఐదు వారాల ఆటలో మొత్తానికి ఒక టాస్కులో అయితే యష్మీ గెలిచింది. 'సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్' ఛాలెంజెస్‌లో భాగంగా 'జాగ్రత్తగా నడువు. లేకపోతే పడతావ్' అనే టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. ఈ గేమ్ ఏంటంటే బాస్కెట్లో ఉన్న 8 బాల్స్‌ను అటువైపు మరో బాస్కెట్లో వేయాలి.. కానీ 'సీసా' (seesaw) మీదుగా బ్యాలెన్స్ చేసుకుంటూ అందులో వేయాలి.. 8 నిమిషాల్లో ఎవరైతే ముందు వేస్తారో వాళ్లు విన్నర్.. గేమ్‌లో ముందుగా బాల్స్ అన్నీ వేసిన మణికంఠ దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోయాడు. మరోవైపు యష్మీకి అటు నిఖిల్, ఇటు పృథ్వీ సలహాలు ఇస్తూ మొత్తానికి గెలిపించేశారు. ఇక గేమ్ గెలవగానే యష్మీ చేసిన ఓవరాక్షన్ మాములుగా లేదు.
ఆ తర్వాత పెట్టిన మూడో ఛాలెంజ్‌లో ఆదిత్య-నబీల్ పోటీపడగా ఆదిత్య గెలిచాడు. దీంతో ప్రేరణ దగ్గరికెళ్లి.. గేమ్ అనగానే నబీల్ పరిగెత్తుకొస్తాడు.. కానీ ఏమన్నా ఆడాడా అంటే బక్వాస్‌గా ఆడాడని యష్మీ అంది. అయితే మొన్న వీకెండ్ ఎపిసోడ్‍లో నాగార్జున ముందు నబీల్ గురించి యష్మీ ఎలా పొగిడిందో తెలిసిందే. ఆట అంటే నబీల్‌లా ఆడాలి సర్.. అంటూ నాగార్జున ముందు చెప్పి ఇప్పుడు ఒక్క గేమ్ తను గెలవగానే నబీల్ గేమ్ బక్వాస్ అంటూ కామెంట్లు చేసింది యష్మీ. ఇది బ్యాక్ బిచ్చింగ్ అంటే.. మనిషి ముందు ఒకలా మనిషి లేనప్పుడు ఒకలా.. కన్నింగ్ మైండ్ సెట్ తో ఉన్న యష్మీని చూసి నెటిజన్లు మండి పడుతున్నారు.
ఇక హౌస్ లో నిన్న జరిగిన టాస్క్ లలో స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో విష్ణుప్రియ, నిఖిల్ పోటీపడగా.. ఇన్ టైమ్ లో ఎవరు పూర్తిచేయలేకలోయారు. రెండో టాస్క్ లో మణికంఠ, యష్మీ పోటీపడగా.. యష్మీ గెలిచింది. మూడో టాస్క్ లో ఆదిత్య, నబీల్ పోటీపడగా.. ఆదిత్య గెలిచాడు.
Also Read