జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -306 లో......లక్ష్మీ, సుధా కూరగాయల గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే జయని ఉద్దేశ్శించి లక్ష్మి మాట్లాడుతుంది. ఎవరు నాసిరకం ఎవరు మంచివారో తెలియడం లేదని లక్ష్మీ అంటుంటే ఏంటి ఆవిడ అలా మాట్లాడుతుంది నాపై డౌట్ వచ్చిందా అని జయ అనుకుంటుంది. మరొకవైపు వీరు తన మనుషులతో ఫారెన్ వాళ్ళతో బిజినెస్ డీలీంగ్ పెట్టుకోవాలని నేను అప్పాయింట్మెంట్ తీసుకున్న నా పేరు రుద్ర అంటూ వీరు లోపలికి వెళ్తాడు.
అక్కడ ఫారెనర్స్ గెటప్ లో ఉంది ఎవరో కాదు గంగ, రంగా.... రంగా ఫారెనర్ పంప్ గా, మోరాకో గా గంగా యాక్టింగ్ చేస్తారు. వీరు వాళ్ళతో డీలింగ్ కుదర్చుకోవడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతాడు. డీలింగ్ కి వాళ్ళు ఒప్పుకోవడంతో దానికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్ రెడీ చేసి వస్తామని వీరు బయటకు వస్తాడు. రుద్రకి రంగా ఫోన్ చేసి మా పర్ఫామెన్స్ ఇరగదీసాము.. బయట నీ పర్ఫామెన్స్ ఉంటుందని రంగా అంటాడు. రుద్ర లోపలికి ఎంట్రీ ఇవ్వబోతుంటే సెక్యూరిటీ ఆపుతాడు. ఆల్రెడీ రుద్ర అనే అతను లోపలికి వెళ్ళాడు అంటాడు. అప్పుడే రుద్రని వీరు చూసి ఇక్కడ నన్ను రుద్ర చూస్తే ప్రాబ్లమ్ అవుతుందని తన బిజినెస్ పార్టనర్స్ ని వెళ్లమని చెప్తాడు. వాళ్ళతో రుద్ర మాట్లాడుతాడు. మీరు ఇషిక సూర్యని మోసం చేసానని అనుకుంటున్నారు కానీ అది మీకే ప్రాబ్లమ్ పాత డీలింగ్ క్యాన్సిల్ కాకుండా ఇలా కొత్త డీలింగ్ పెట్టుకుంటే ప్రాబ్లమ్ అని వాళ్లలో భయం పుట్టేలా చేస్తాడు రుద్ర. తర్వాత అక్కడ నుంచి రుద్ర పక్కకి వెళ్లి ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వీరు వచ్చి మీరు ఇంటికి రండి ఇషిక సూర్య డీలింగ్ క్యాన్సిల్ చేస్తున్నట్లు సంతకం పెట్టించుకోండి అని వీరు చెప్తాడు. ఆ మాటలన్నీ రుద్ర వింటాడు.
ఆ తర్వాత సూర్య, ఇషిక, దగ్గరికి వీరు వచ్చి మీ ప్రాబ్లమ్ క్లియర్ అయినట్లే.. వాళ్ళు డీలింగ్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఒప్పుకున్నారని చెప్తాడు. మరుసటిరోజు సూర్యతో కాంట్రాక్టు పెట్టుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తారు. అప్పుడే రుద్ర తనకి దగ్గర అయిన లాయర్ ని పిలిపించి.. అసలు కాంట్రాక్టు క్యాన్సిల్ అయితే ఏమవుతుందని చెప్పమంటాడు. కాంట్రాక్టు క్యాన్సిల్ అయితే నష్టపోయిన వాళ్లకి నష్టపరిహారం ఉండదు కానీ కాంట్రాక్టు క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ లాభాలని లాయర్ చెప్పగానే వీరు షాక్ అవుతాడు. ఏంటి వీరు ఇదంతా అని శకుంతల కోప్పడుతుంది. తరువాయి భాగంలో వీరు బిజినెస్ పార్టనర్స్ ఇంటికి వచ్చి వీరు చేస్తున్న మోసాన్ని ఇంట్లో వాళ్లందరికి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




