Home

»

Tv News

Podarillu: శైలు ప్రేమను తిరస్కరిస్తున్న కేశవ.. అసలు నిజం చెప్పిన చక్రి!

Jun 28, 2026 8:59AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ ఇప్పటికే 145 ఎపిసోడ్ లు పూర్తిచేసుకుంది. చక్రి తాగిన మత్తులో మహా గదికి వెళ్లడంతో కథ మలుపుతిరిగింది. ఆ ఎపిసోడ్ ముందు వరకు చక్రిని మహా అర్థం చేసుకొని కలిసిపోతారేమోనని అనుకున్నారంతా కానీ ఆ ఒక్క సీన్ తో కథ మొత్తం మలుపు తిరిగింది. తను ఇల్లు వదిలివెళ్ళిపోవడంతో మాధవ, కన్నా, కేశవ, నారాయణ అంతా బాధపడతారు.

చక్రిని అందరు తిడుతారు. అవమానిస్తారు. దాంతో చక్రి అందరికి క్షమాపణ చెప్తాడు కానీ ఎవరూ అంతగా పట్డించుకోరు. ఇక చక్రి అందరికి ఎందుకని తాగి రావాల్సి వచ్చిందో చెప్తాడు. దాంతో చక్రిని కేశవ,‌మాధవ అర్థం చేసుకుంటారు. కన్నా మాత్రం కోపంగానే ఉంటాడు. మరోవైపు శైలు గురించి కేశవ ఆలోచిస్తాడు. ‌కేశవ దగ్గర పనిచేసే అతను చెప్పిన నాటి నుండి శైలు అంటే తనకి ప్రేమ ఉందని అర్థం చేసుకుంటాడు కేశవ. ఆ తర్వాత శైలుకి పెళ్ళిచూపులు అని కేశవ దగ్గర పనిచేసే అతను కేశవతో చెప్పగానే అతను షాక్ అవుతాడు. అందుకే తన ఇంటికి వెళ్ళి మరీ ఆరాతీస్తాడు కేశవ. అయితే శైలు తన ప్రేమని చెప్తుంది కానీ కేశవ మాత్రం ఎంతకు బయటపడడు. దాంతో శైలు హర్ట్ అవుతుంది. 

మరోవైపు మహాకి క్షమాపణలు చెప్తూ హాస్టల్ బయట వెయిట్ చేస్తుంటాడు చక్రి. మహా అది చూసి బయటకు వచ్చి చక్రిని ఇష్డమొచ్చినట్డు తిడుతుంది. తర్వాత చక్రి మహా తిట్టిందనే బాధతో, తనమీద తనకే ఉన్న కోపంగా వెళ్తుంటాడు. అసలు ఆ నారాయణ తాగి నాతో అలా మాట్లాడాకపోయి అంటే నేను అలా చేసేవాడిని కాదని అందరితో చక్రి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com