Home

»

Tv News

Jayam serial: వీరు నిజస్వరూపాన్ని తెలుసుకున్న రుద్ర.. సూపర్ ట్విస్ట్!

Feb 22, 2026

 

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -200 లో.... లక్ష్మి, పైడిరాజు ఇద్దరు నా కూతురిది తప్పు అని వీరు కాళ్లపై పడబోతుంటే అప్పుడే గంగ వచ్చి ఆపుతుంది. ఏ కూతురు అయిన తల్లిదండ్రులని తలెత్తుకునేలా చెయ్యాలి కానీ ఇలా తలదించుకునేలా కాదు.. తప్పు చేసింది నేను.. శిక్ష కూడా నాకే అందుకే నేనే క్షమాపణ అడగాలని వీరు కాళ్లపై పడి క్షమాపణ అడుగుతుంది గంగ. అయ్యో గంగ నువ్వు నాకు సారీ చెప్పాలని ఏం అనుకోలేదు.. నాకు ఈ కుటుంబం మాత్రమే కోసమే ఏది చేసినా కానీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావ్.. ఇకనుండి జరిగిందంతా మర్చిపోండి హ్యాపీగా ఉందామని వీరు అంటాడు. 

 

ఆ తర్వాత గంగ బయటకు వెళ్తుంటే.. వీరు ఎదురుపడతాడు. ఏదో ఛాలెంజ్ చేసావ్ కదా.. నా జోలికి వస్తే ఏం అవుతుందో తెలిసిందా భానుని నేనే చంపానని నిరూపిస్తాను అన్నావ్.. అది నీ వల్ల కాదు నాకు ఈ కుటుంబ నాశనం కావాలి.. ఇది గుర్తుపెట్టుకోమని వీరు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అదంతా రుద్ర వింటాడు. 

 

ఇక తన గదిలో బెడ్ పై కూర్చొని గంగ ఏడుస్తుంటే రుద్ర వెళ్లి సారీ గంగ అని చెప్తాడు. మీరెందుకు నాకు సారీ చెప్తున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకసారి కూడా నమ్మలేదని గంగ అంటుంది. జరిగిన దాంట్లో నీ తప్పు లేదని నాకు తెలుసు.. నువ్వు వీరుని ప్రతీసారీ ఎందుకు అంటున్నావని డౌట్ వచ్చి కాల్స్ చేక్ చేశాను. ఇందాక నీకు వార్నింగ్ ఇవ్వడం చూసానని రుద్ర చెప్తాడు. నాకు వీరు గురించి తెలుసు కానీ తెలియనట్లు ప్రవర్తించి వాడి దారిలోనే వెళ్లి వాడి నోటితోనే నిజం చెప్పిస్తాను.. దానికి నీ సపోర్ట్ కావాలని గంగని రుద్ర అడుగుతాడు. అయ్యో తప్పకుండా సర్ అని గంగ చెప్తుంది.

 

మరొకవైపు బాక్సింగ్ పోటీ నుండి దీప్తిని తప్పించాలని పారు వాళ్ళ అన్న తనకి డబ్బు ఇస్తాడు కానీ దీప్తి తీసుకోదు. అదే విషయం అక్కడున్న రుద్ర మనిషి రుద్రకి ఫోన్ చేసి చెప్తాడు. దాంతో గంగ దగ్గరికి రుద్ర వచ్చి.. అక్కడ దీప్తిని ఇబ్బంది పెడుతారనుకుంటా.. అకాడమీలోకి వెళ్ళడానికి నీకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది..  నువ్వు నాతో రా గంగ అని రుద్ర అనగానే లేదు సర్ అమ్మగారు వద్దని చెప్పారని గంగ అంటుంది. దాంతో రుద్ర ఒక్కడే వెళ్లి అకాడమీలో ఏం జరుగుతుందో అతని మనిషి ద్వారా తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com