Home

»

Tv News

Illu Illalu Pillalu: నగలు తాకట్టు పెట్టిన నర్మద, సాగర్.. ఆనందరావు చూస్తాడా!

Feb 22, 2026

 

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -401 లో.. అమూల్యతో ప్రేమ మాట్లాడుతుంది. ఏదైనా తెలియాల్సిన టైమ్ లో తెలుస్తుంది కానీ నువ్వు ఏ విషయం ఆ వల్లికి చెప్పకని అమూల్యతో ప్రేమ అంటుంది. అప్పుడే ధీరజ్ ఫ్రెండ్స్ కార్ తీసుకొని వెళ్లి ఆక్సిడెంట్ చేసారని ధీరజ్ కి ఫోన్ చేసి చెప్తారు. దాంతో ధీరజ్ టెన్షన్ పడుతాడు. ప్రేమ తన దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతుంది. ధీరజ్ విషయం చెప్తాడు. నీతో పాటు నేను వస్తానని ప్రేమ అనగానే వద్దని ధీరజ్ అంటాడు. నేను వస్తాను.. లేదంటే ఇంట్లో చెప్తానని ప్రేమ బ్లాక్ మెయిల్ చేస్తుంది. దాంతో ప్రేమని తన వెంట తీసుకొని వెళ్తాడు ధీరజ్.

 

మరొకవైపు లెక్కల్లో రెండు వేలు తేడా వచ్చిందని రామరాజుతో చందు చెప్తాడు. రామరాజు లెక్కలు మళ్ళీ చూస్తాడు. అదంతా మన చేతివాటం అని వాళ్ళకి తెలియదని భాగ్యంతో ఆనందరావు అంటాడు. శ్రీవల్లి అల్లుడు గారు ఏంటి లెక్కలు గుచ్చి గుచ్చి చేస్తున్నాడని భాగ్యం అంటుంది. నేను వెళ్లి డైవర్ట్ చేస్తానని శ్రీవల్లి వెళ్లి మావయ్య గారు ఈ రోజు వనజ గారికి డబ్బు ఇవ్వాలని గుర్తుచేస్తుంది. అవును మంచిగా గుర్తు చేసావని రామరాజు అంటాడు. 

 

ఇక అప్పుడే సాగర్ ని శ్రీవల్లి పిలుస్తుంది. డబ్బు వనజకి ఇవ్వమని చెప్పు బుజమ్మ అని రామరాజు అంటాడు. సరే అని సాగర్ అంటాడు. సాగర్ మర్చిపోతాడు పాస్ బుక్ ఇస్తే మీరే తీసుకోవచ్చు కదా అని శ్రీవల్లి అనగానే అవునని రామరాజు అంటాడు. మావయ్య గారు మీ అబ్బాయి మీద నమ్మకం లేకపోతే మీరే వెళ్లి తెచ్చుకోండి అని నర్మద అనగానే మా కొడుకు మీద మాకు నమ్మకం లేకపోవడమేంటి.. మీరే వెళ్లి డబ్బు విత్ డ్రా చేసి తీసుకొని రండి అని వేదవతి అంటుంది. 

 

ఆ తర్వాత నర్మద నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని రావాలని నిర్ణయం తీసుకొని అన్ని బ్యాగ్ లో పెడుతుంది. నర్మద సాగర్ వెళ్లడం ఆనందరావు చూసి భాగ్యం, శ్రీవల్లికి విషయం చెప్తాడు. వెంటనే వాళ్ళని ఫాలో అవ్వమని భాగ్యం చెప్తుంది. 

 

మరొకవైపు ధీరజ్ కార్ ఓనర్ ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి కార్ ఇచ్చినందుకు తిడతాడు. మీ ఫ్యామిలీలో మీ చెల్లి కూడా లేచిపోయింది అంట కదా అని అనగానే ధీరజ్ తనపై సీరియస్ అవుతాడు. దాంతో ప్రేమ ఆపుతుంది. మరొకవైపు నర్మద, సాగర్ నగలు తాకట్టు పెట్టడానికి వెళ్తారు. వాళ్ళని ఆనందరావు చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com