Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కీలక మలుపు.. అతని మీద కోప్పడ్డ రామరాజు!
on Nov 29, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -16 లో....భద్రవతి బాంబులు పేల్చుతూ హ్యాపీగా ఉంటుంది. అప్పుడే తన ఆనందానికి కారణం మా కుటుంబంలో ఏదో విషయం అయి ఉంటుందని రామరాజు అనుకుంటాడు. వాళ్ళ సంతోషానికి కారణం అన్నయ్య విషయమై ఉంటుందా అని ధీరజ్ అనుకుంటాడు. నాకు తెలియకుండా ఏదో జరుగుతుందని రామరాజు ఆలోచిస్తుంటాడు. అప్పుడే వేదవతి వస్తుంది. ఎప్పుడు లేనిది భద్రవతి ఇంత సంతోషం ఉందంటే అందుకు కారణం కచ్చితంగా మన కుటుంబంలోని ఒక విషయమై ఉంటుందని రామరాజు అంటాడు.
మన కుటుంబంలో ఏ సమస్య ఉంది. మన పిల్లలు ప్రతీ విషయం చెప్తారు. ఏ విధంగా సమస్యలు వస్తాయని వేదవతి అంటుంది. నా వెనకాల ఏదో జరుగుతుంది. నాకు అర్ధం కావడం లేదు. అది తెలుసుకోవాలని రామరాజు అంటాడు. ఆ తర్వాత వేదవతి చందు దగ్గరికి వచ్చి వాటర్ తాగించి.. తనను చూసి బాధపడుతుంది. ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి వేదవతి వచ్చి.. ఏదైనా అన్నయ్య గురించి దాస్తున్నావా అని అడుగుతుంది. అదేం లేదని ధీరజ్ అంటాడు. ఎన్ని రోజులు దాస్తావో చూస్తానని వేదవతి అంటుంది.
మరుసటి రోజు ముగ్గురు రెడీ అవుతారు. వేదవతి పూజ చేసి ముగ్గురికి హారతి ఇస్తుంది. ఆ తర్వాత మీరందరు ఇంతకు ముందు సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు అలా లేదంటూ దిష్టి తీస్తుంది వేదవతి. ఆ తర్వాత రామరాజు వచ్చి ముగ్గురికి బట్టలు తీసుకొని వచ్చి రెడీ అవ్వమంటాడు. బయటకు తీసుకొని వెళ్లి ఫొటోస్ తీయిస్తాడు. ఆ తర్వాత ఆ ఫొటోస్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి ఇచ్చి ముగ్గురు కొడుకులకి మంచి సంబంధం చూడమని చెప్తాడు. తరువాయి భాగంలో రేపు మనం ఒకరి ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడాలని రామరాజుతో సాగర్ అంటాడు. దాంతో రామరాజు ఏంటని కోప్పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read