Eto Vellipoyindhi Manasu : కపటప్రేమ చూపిస్తున్న సవతి తల్లి.. కొడుకు గుర్తించగలడా?
on Nov 29, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -266 లో.....శ్రీవల్లి, శ్రీలత , సందీప్ లు వంట చేస్తుంటారు. ఏంటి రామలక్ష్మి, సీతా బావ గొడవ పడట్లేదని శ్రీవల్లి చిరాకు పడుతుంది. మరొకవైపు సీతాకాంత్ వెళ్తుంటే రామలక్ష్మి చెయ్ పట్టుకొని ఆపుతుంది. ఎలాగా మీరు బర్త్ డే కి తెచ్చారు కదా.. నాకు మీరే పెట్టండి అని రామలక్ష్మి అనగానే.. నెక్లెస్ పెడతాడు. దాంతో రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత మాణిక్యం వెళ్తుంటే.. శంకర్ కన్పిస్తాడు. అతని దగ్గరికి వెళ్లి సందీప్ ని డబ్బులు ఇవ్వడంటూ సందీప్ గురించి నెగటివ్ గా చెప్తాడు. దాంతో సందీప్ పై శంకర్ కోపంగా ఉంటాడు. ఆ తర్వాత అసలు ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నావని పెద్దాయన, సిరి అడుగుతారు. ఇప్పుడు నేను నిజం చెప్పిన కూడా అసలు మీరు నమ్మరు.. అందుకే నేను చెప్పట్లేదని రామలక్ష్మి అంటుంది. మీరు విడిపోతున్నారని తెలిసి నిన్ను నీ మాటలని ఎలా నమ్మమంటావని సిరి అంటుంది. నేను ఆ విడాకుల పేపర్ పంపలేదని రామలక్ష్మి చెప్తుంది.
ఆ తర్వాత రామలక్ష్మి టిఫిన్ చేస్తుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. రామలక్ష్మి టిఫిన్ చేస్తుంటే శ్రీలత, సందీప్, శ్రీవల్లి లు నిల్చొని ఉంటారు. దాంతో సీతాకాంత్ కి కోపం వస్తుంది. తినండి అని సీతాకాంత్ ని రామలక్ష్మి అనగానే.. తిననని సీతాకాంత్ కోపంగా మాట్లాడతాడు. నా తల్లి నాపై చూపించే ప్రేమని రామలక్ష్మికి చూపించాలనుకొని ఫ్రూట్ కట్ చేస్తు చెయ్ కట్ చేసుకుంటాడు. అయ్యో అంటూ శ్రీలత ప్రేమ నటిస్తుంది. సీతాకాంత్ ని రామలక్ష్మి తీసుకొని వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read