Illu illalu pillalu: ప్రేమని పెళ్లి చేసుకుంది ధీరజ్ అని తెలుసుకున్న రామరాజు.. షాక్ లో ఇరు కుటుంబాలు!
on Jan 15, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-55లో.. ప్రేమ తిరిగి ఇంటికి రావడంతో భద్రవతి అండ్ కో బ్యాచ్ తలో మాట అంటుంటారు. మా బాధని కడుపుకోతని అర్థం చేసుకుని వెనక్కి తిరిగి వచ్చావ్.. అది చాలు అని కూతుర్ని దగ్గరకు తీసుకోబోతూ.. ప్రేమ మెడలో తాళిని చూస్తుంది తల్లి రేవతి. మెడలో ఈ తాళి ఏంటే.. అంటే నీకు పెళ్లైపోయిందా? మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావా? ఇంతకి తెగించావే అని ప్రేమ చెంపలు చెల్లుమనిపిస్తుంది రేవతి. నీ మేనత్త నీకు బంగారం లాంటి సంబంధం చూస్తే.. ఇలా దొంగతనంగా పెళ్లిచేసుకోవాల్సిన అవసరం నీకేంటే?? పెళ్లి చేసుకుని వచ్చి ఈ కుటుంబాన్ని బజారుకి లాగాలని చూస్తావా? అని అంటుంది. ఇంతలో విశ్వ.. మా చెల్లి అమాయకురాలు.. ఎవరో దీన్ని మాయచేశారు. మాయ మాటలు చెప్పి తాళి కట్టారు? ఎవడాడు? నీ మెడలో తాళి కట్టింది ఎవరు? రేయ్.. ఎవడ్రా నువ్వు రారా బయటకు దిగరా కారు అని అరుస్తాడు. వాడు ఎవడని? ఎదురింటి నుంచి రామరాజు కూడా కోపంగా చూస్తుంటాడు. ఇక వేదవతి అయితే.. శ్రీరామా శ్రీరామా అని దేవుడ్ని మొక్కుకుంటూ ఉంటుంది.
రేయ్ కారు దిగరా అనేసరికి ధీరజ్.. కారు దిగుతాడు. కొడుకుని చూసి రామరాజు షాక్ అయిపోతాడు. అతనితోపాటు అక్కడున్న వాళ్లంతా స్టన్ అయిపోతారు. భద్రవతి అయితే నోరెళ్లబెట్టేస్తుంది. రేయ్ నువ్వా?? నా చెల్లెలి మెడలో తాళి కట్టింది నువ్వా.. ప్రేమ పేరుతో నా చెల్లెలి వెంట పడుతున్నావని నా చెల్లెలు చెప్పినప్పుడే నిన్ను చంపేయాల్సిందిరా.. తప్పు చేశాను. నా చెల్లెల్ని మోసం చేసి మెడలో తాళి కడతావా? నిన్ను చంపేస్తానంటూ వెళ్లి ధీరజ్ పీక పట్టుకుంటాడు విశ్వ. తమ్ముడు మీద చేయి పడేసరికి ధీరజ్ అన్నలు ఉరుక్కుంటూ వస్తారు. వేదవతి కూడా రేయ్.. ఆగండ్రా అంటూ వస్తుంది. రామరాజు మాత్రం షాక్‌లోనే ఉండిపోతాడు. ఇక సేనాపతి అయితే.. మన శత్రువు కొడుకు లేచిపోయి వాడి ముందు తలదించుకునేట్టు చేశావ్. మా పరువుని రోడ్డున పడేశావ్. తల ఎత్తకుండా చేశావ్ అని అంటాడు. అది కాదు నాన్నా అని ప్రేమ నోరు విప్పేసరికి.. మాట్లాడకు.. ప్రేమించడానికి ఈ అనాధ గాడి కొడుకే దొరికాడా నీకు అని రెచ్చిపోతుంది భద్రవతి. నిన్ను ఈ చేతులతో పెంచి పెద్ద చేసింది.. ఈ అవమానం పొందడానికా? పాతికేళ్ల క్రితం అది ఎలాగైతే చేసిందో.. నువ్వు కూడా అలాగే చేసి నా గుండెలపై తన్నావ్ కదే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది భద్రవతి. దాంతో సేనాపతి.. అక్కా నా కూతురు అమాయకురాలు.. ఇదంతా ఆ రామరాజుగాడి కుట్ర.. వాడి కొడుకుతో కావాలనే ఇదంతా చేయించాడు. వాడి రెండో కొడుకు లేపుకుని వెళ్లిపోయాడని మనం నవ్వాం కదా.. దానికి ప్రతికారం తీర్చుకుంటున్నాడు. అందుకే వాడి చిన్న కొడుకుతో నా కూతుర్ని లేపుకుని వెళ్లిపోమని చెప్పాడు. మనపై పగసాధిస్తున్నాడని అంటాడు. ఆ మాటతో వేదవతి.. అన్నయ్యా.. నోరు ముయ్.. దేవుడు లాంటి మనిషిపై నిందలు వేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు.. తనకి ద్రోహం చేసిన వాళ్లని కూడా క్షమించే గొప్ప మనసున్న మనిషి మా ఆయన అని అంటుంది వేదవతి.
ఏయ్ నీకు మాట్లాడే అర్హత లేదు.. వీడేంటో వీడి నీఛమైన బతుకేంటో పాతికేళ్ల క్రితమే చూశాం.. అన్నంపెట్టిన ఇంటికే వెన్నుపోటు పొడవడం వాడికి వెన్నతో పెట్టిన విద్య అని అంటాడు సేనాపతి. ఇక భద్రవతి అందుకుని.. రామరాజుని నానా మాటలు అంటుంది. నీదీ ఒక బతుకేనా.. ఇలాంటి బతుకు బతకడానికి సిగ్గుగా లేదా.. అని అంటుంది. ఆమాటతో ధీరజ్‌కి కోపం తన్నుకొస్తుంది. ఏయ్ నోరు నోరు.. అదుపులో పెట్టుకో.. నన్ను అనండి భరిస్తా... కానీ మా నాన్న ఎవరైనా ఏమైనా అంటే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇస్తాడు. ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావ్.. మీ నాన్న పెద్ద మహాత్ముడా? మీ నాన్న నా చెల్లెల్ని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. మీ అన్న దాన్ని లేపుకొచ్చాడు.. నువ్వు నా మేనకోడల్ని లేపుకెళ్లావ్.. అలాంటి మీరు మంచి మర్యాద గురించి మాట్లాడుతున్నారా? అని అంటారు. దాంతో ధీరజ్.. ప్రేమ వైపు చూస్తూ.. ఏయ్.. మీ వాళ్లు మా నాన్నని అన్ని మాటలు అంటుంటే అలా బొమ్మలా చూస్తున్నావ్ ఏంటే.. సమాధానం చెప్పు.. మన పెళ్లి వెనుక మా నాన్న ఉన్నారా.. నేను నిన్ను బలవంతంగా లేపుకుని వెళ్లి పెళ్లి చేసుకున్నానా.. ఏం జరిగిందో చెప్పవే అని అంటాడు. ఏంట్రా నా చెల్లెల్ని లేపుకుని వెళ్లి మా ముందే బెదిరిస్తున్నావ్ అని ధీరజ్ పీక పట్టుకుంటాడు విశ్వ. ఇంతలో సేనాపతి లోపలికి వెళ్లి గన్ తెచ్చి.. ధీరజ్‌కి గురిపెడతాడు. రామరాజుని వేదవతి ఎంత వేడుకున్నా అడుగుముందుకు వేయడు. సేనాపతి గన్ గురిపెట్టి ధీరజ్ని కాల్చేస్తుండగా.. ఆపండి నాన్నా అంటూ ధీరజ్‌కి అడ్డుగా నిలబడుతుంది ప్రేమ. ధీరజ్ నన్ను బలవంతంగా తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకోలేదు. నా ఇష్టంతోనే వెళ్లిపోయాను. ఎవరూ కుట్రలు చేయలేదు. నా ఇష్ట ప్రకారమే ఇదంతా జరిగిందని ప్రేమ అంటుంది.
ఆ మాటతో అంతా షాక్ అవుతారు. చేసేది లేక.. భద్రవతితో పాటు సేనాపతి వాళ్లంతా లోపలికి వెళ్లిపోతారు. ఇక శారదాంబ అయితే ఆ కొత్త జంటని చల్లగా చూడు స్వామీ అని దేవుడ్ని వేడుకుంటుంది. మరోవైపు రామరాజు అయితే ధీరజ్ చెంప చెల్లుమనిపిస్తాడు. జీవితాంతం తల ఎత్తుకోకుండా చేశావ్ కదరా.. గుండెలపై తన్నే పని చేశావ్ కదరా అని ఆవేశపడతాడు. అయితే దీనంతటికి కారణం అయిన వేదవతి.. అయ్యో.. మీ పెంపకాన్ని నిందించొద్దు.. దీనికి బలమైన కారణమే ఉండి ఉంటుంది.. వాడు మీ పరువుతీసే పని చేయడు అని అంటుంది. ఏంటి బుజ్జమ్మా.. ప్రేమ పెళ్లి చేసుకోవద్దని చెప్పాను కదా.. కానీ నా మాటని ఒక్కడైనా విన్నాడా.. పాతికేళ్లుగా నరకం చూస్తున్నా.. వీళ్లకి అర్థం కాదా.. అని రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read