వీళ్ళ పెళ్లి ఎప్పుడో తెలుసా?
on Jan 15, 2025
బుల్లితెర మీద నటీనటులు, యాంకర్ ల వయసుల గురించి తెలుసుకోవాలని చాలామంది ఆడియన్స్ తెగ ఆరాటపడిపోతుంటారు. ఐతే కొంతమంది చెప్తారు. కానీ మాగ్జిమం వాళ్ళు వయసును చెప్పడానికి అస్సలు ఇష్టపడనే ఇష్టపడరు. ఐతే ఇప్పుడు హోస్ట్ ప్రదీప్, శ్రీముఖి వయసులు ఓపెన్ గా చెప్పేసారు. అది విన్న ఆడియన్స్ ఇంత చిన్న వయసా అనుకుంటున్నారు. సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ గా స్టార్ మాలో మా సంక్రాంతి వేడుక జరిగింది. ఈ షోకి యాంకర్ గా చేసిన ప్రదీప్ తాను నటించిన "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" మూవీ ప్రమోషన్ కి వచ్చాడు. అందులో శ్రీముఖి ప్రదీప్ ని కొన్ని ప్రశ్నలు అడిగింది. దాంతో అసలు విషయం బయటపడింది.
"ప్రదీప్ మాచిరాజు గారి అసలైన వయసు ఎంత" అని అడిగింది. "12 ఏళ్ళు . అదే నేను టీవీకి వచ్చి ఇన్నేళ్లు అయ్యింది" అన్నాడు. "అది కాదు మేము అడిగింది ఈ ప్రపంచంలో మీరు అడిగి పెట్టి ఎన్నేళ్లు అయ్యింది" అని అడిగింది. "నీ ఏజ్ చెప్పు" అని శ్రీముఖిని అడిగాడు. "నా ఏజ్ ఎందుకు" అంది శ్రీముఖి. "వయసు చెప్తే దాని నుంచి మైనస్ చేసుకుంటా" అన్నాడు. "నా వయసు 31 " అని చెప్పింది శ్రీముఖి. "ఐతే నా వయసు 35 . నేను ఎంత పెరిగినా నేను ఈ సీనియర్ యాక్టర్స్ ముందు చిన్నపిల్లాడిని " అని చెప్పాడు ప్రదీప్. " ఇక నా లైఫ్ లో చాలా బ్రేకప్స్ జరిగాయి. కానీ వాటిని బ్రేకప్స్ గా తీసుకోలేదు. ఒక ట్రాఫిక్ సిగ్నల్ లా ఫీలవుతాను. నా లైఫ్ లో బొచ్చెడు యుటర్న్ లు, డివైడర్లు, రెడ్ లైట్ లు. ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు. ఛి పో అంటే పక్కకు పోతాం అంతే..ఇక నా పెళ్లి ఎప్పుడు అంటే మా బాచిలర్స్ అధ్యక్షురాలు శ్రీముఖి ఎప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడు" అంటూ సరదాగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసారు.
Also Read