బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిలా ఉంది అంటూ పరువు తీసేసిన ఆది
on Apr 5, 2025
ఢీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సోనియా సింగ్ మీద ఆది వేసిన పంచులు మాములుగా లేవు. "లంచు కోస్తావా మంచు కోస్తావా" అనే పాటలు పెట్టే బదులు మంచి మెడ్లే సాంగ్స్ పెట్టొచ్చుగా" అంది సోనియా. దానికి ఆది " ఈ ఇడ్లి అమ్ముకునే దానికి మెడ్లే కావాలా" అనేసరికి షాకైంది సోనియా. "ఆది నేను డైటింగ్ చేసి సన్నగా అయ్యాను" అంది సోనియా. "బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిలా ఉంది" అనేసరికి తలతిప్పేసింది. ఇక ఇప్పుడు హోస్ట్ నందు వంతు వచ్చింది. "చిలకలాగా భలే ఎనర్జిటిక్ గా ఉంటుంది సోనియా తెలుసా..నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా సోనియా "అని అడిగాడు. "లేదు జస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి" అనేసింది సోనియా. మళ్ళీ నందు "సడెన్ గా ఎలా మారిపోయావు" అన్నాడు డౌట్ తో..వెంటనే ఆది రియాక్ట్ అయ్యాడు.
పంచ్ కోసం ఎప్పుడూ రెడీ ఉంటాడుగా "వీధి కుక్క కరిచింది. అందుకే మారిపోయింది" అంటూ డైలాగ్ కొట్టాడు. ఆ డైలాగ్ తో సోనియా షాక్ ఆది రాక్ అన్నట్టుగా ఉంది. అలాగే కంటెస్టెంట్స్ లో ఒక జోడి ఐతే "సేవ్ బర్డ్స్ సేవ్ నేచర్" అంటూ మొబైల్ రేడియేషన్ వల్ల పక్షులు ఎలా చనిపోతున్నాయో చెప్తూ చేసిన డాన్స్ కి జడ్జెస్ ఫిదా ఇపోయారు. అసలు ఈరోజున అడవులు, పక్షులు నాశనమైపోతున్నాయి అంటే దానికి ముఖ్య కారణం మొబైల్ రేడియేషన్. ఆ వేడికి తట్టుకోలేక ఎలా చనిపోతున్నాయో ఈ డాన్స్ లో చేసి చూపించారు. వీళ్ళ డాన్స్ చూసిన విజయ్ బిన్నీ మాష్టర్ ఐతే మీరిద్దరూ డాన్సర్స్ కాదు పెర్ఫార్మర్స్ అంటూ కితాబిచ్చారు. ఈ సాంగ్ చేస్తున్నంత సేపు కూడా ఆది పక్కన కూర్చున్న అశ్విని ఎమోషనల్ అవుతూనే కనిపించింది. హన్సిక కూడా బాధపడుతూ ఉంది. అలాగే ఈ సాంగ్ కి కోరియోగ్రఫీ క్లీన్ గా ఉంది అంటూ గణేష్ మాష్టర్ చెప్పుకొచ్చారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
