
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈ ప్రోమో స్టార్టింగ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది లాస్ట్ లో ఎమోషనల్ గా ఎండ్ అయ్యింది. ఈ స్టేజి మీద యాదమ్మ రాజు, స్టెల్లా వాళ్ళ అమ్మాయి గిఫ్టితో కలిసి వచ్చారు. " వెల్కమ్ గిఫ్టీ హాయ్ చెప్పు అందరికీ అని శ్రీముఖి అనగానే అందరికీ హాయ్ చెప్పింది . "నీకు డాడీ ఇష్టమా మిమ్మీ ఇష్టమా" అని అడిగింది. "మిమ్మీ" అని చెప్పింది. ఇక స్టెల్లా ఐతే ఫుల్ ఖుషీ ఐపోయింది. వెంటనే శ్రీముఖి " నీకు ముగ్గురు మామలు ఉన్నారు ఆ మామల మెడలో చెయిన్ లు ఉన్నాయి చూడు . నువ్వు మామ అంటే నీ మెడలో వేసేస్తారు బేటా " అంది. వెంటనే యాదమ్మ రాజు మైక్ ని తన కూతురు గిఫ్టి ముందు పెట్టేసరికి " మామ " అనేసింది. వెంటనే అవినాష్ లేచి వచ్చి తన మెడలోని చైన్ ని గిఫ్టి మేడలో వేసాడు. " వద్దా " అంటూ అవినాష్ మళ్ళీ వెనక్కి తీసేసుకుని సరికి శ్రీముఖి పగలబడి నవ్వింది. " ఇది ఫేక్ ఇవ్వడని తెలిసిపోయింది " అంటూ పక్కనుంచి హరి కౌంటర్ వేసాడు.
" రాజు నీ గిఫ్టీ మీ జీవితంలోకి వచ్చాక లైఫ్ ఎలా మారింది చెప్పు " అని స్రేముఖి అడిగింది. " అంటే ఆఫ్టర్ గిఫ్టీ అంటే బేసిక్ ఈమె ఎనిమిది నెలలకే పుట్టేసింది . అప్పుడు డాక్టర్ అన్నారు ఏందంటే ఏమీ చెప్పలేము. ఎవరు బతుకుతారు ఎవరు బతకారు అని. " అన్నాడు యాదమ్మ రాజు. వెంటనే స్టెల్లా " నేను హాస్పిటల్ లో ఒకటే ఒక క్వశ్చన్ అడిగా అంటే నేను హర్ట్ అవ్వకుండా బేబీ బయటికి వస్తదా అని. నాకు ఇట్లా సి సెక్షన్ అయింది కడుపు కొస్తే నాకు ఏడుపు వినిపిస్తుంది నేను ఎవరిదో ఏడుపు అనుకున్నా ఎందుకంటే నా బిడ్డ ఏడవదని డాక్టర్ ఆల్రెడీ చెప్పేసారు. ఇది నిజంగా మా జీవితంలో మిరకిల్ అక్క " అని ఎమోషనల్ అయ్యింది.
వెంటనే శ్రీముఖి అవినాష్ ని కూడా అడిగింది. " నువ్వు నీ జీవితంలో ఫేస్ చేసింది చెప్పేస్తే ఇంకా ఆ భారం పూర్తిగా తీరిపోతుందని నా అభిప్రాయం" అంది. " బాబు కడుపులో ఉన్నాడు సడన్ గా కాల్ వచ్చింది ఏమైందంటే బాబు లోపల చనిపోయారండి అని చెప్పారు. నేను వెళ్లి పొట్ట దగ్గరికి వెళ్లి నాన్న లేవు లేవు లేవలే అని అప్పటికే మార్నింగ్ ఏ చనిపోయాడు అంట తెలీదు నేను చనిపోయిన బాబుతోనే నేను ఈవెనింగ్ అంతా ఆడుకున్నాను యాక్చువల్లీ డాక్టర్ కాళ్ళ మీద పడ్డాను మేడం సినిమాలో ఇలా నొక్కితే బతుకుతారు కదా మేడం అదేనా చేయండి మేడం ప్లీజ్ మేడం అన్నా. ఆ లైఫ్ నుంచి బయటకు రాలేకపోయాను " అన్నాడు అవినాష్ ఎమోషనల్ గా .




.webp)
.webp)
