.webp)
బిగ్ బాస్ 10 రైతు బిడ్డ ఝాన్సీ ఆటతీరు మాములుగా లేదు. ఆమె చాలా స్ట్రాంగ్ గా టాస్కులన్నీ ఆడింది. ఆమె ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి చెందిన కోమటికుంట గ్రామంలో పుట్టింది. అలాగే ఆమె ఒక సింగర్ కూడా. పీజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసింది. పొలంపనులతో పాటు ఇంటి పనులు చూసుకుంటూ చదువుకుంటూ మరో వైపు ప్రభుత్వ పరీక్షలు కూడా ప్రిపేర్ అవుతున్నట్లు అగ్ని పరీక్షలో చెప్పుకొచ్చింది. అలాంటి ఝాన్సీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక తన పొలం దగ్గరకు వెళ్లి ఒక రీల్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
" హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ జాన్సీ. నేను బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత అందరూ అడుగుతున్నారు అక్క మీరు ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తారా అని. సో వాళ్ళందరికీ నేను సమాధానం ఇచ్చినా కానీ ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఎంతో మందిలో ఉన్నాయ్ . అందుకే ఈ వీడియో రూపంలో నేను వాళ్లందరికీ ఆన్సర్ ఇస్తున్నా. సో నేను ఎప్పుడు ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా కానీ నేను ఏ స్థాయి నుంచి వచ్చినా అనే దాన్ని అయితే మర్చిపోను. ఎందుకంటే ఈ మట్టిలోనే నా ప్రయాణం మొదలైంది. ఈ మట్టే నాకు కష్టపడడం నేర్పించింది. ఈ పొలమే నాకు కష్టానికి విలువేంటో చూపించింది. మీ అందరి ప్రేమ వల్ల నేను బిగ్ బాస్ వరకు వెళ్ళిన. కానీ నేను నా ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైందో అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను, మర్చిపోను కూడా. సో నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇన్ని రోజుల తర్వాత మా పొలం దగ్గరికి వచ్చిన. కొద్దిగా పొలం కోపించిరు డాడీ వాళ్ళు. ఇంకా ఇది ఒక్క మడే ఉంది, ఇది లేటుగా పెట్టినమన్నమాట అప్పుడు నారు సరిపోక. సో ఈ టూ త్రీ డేస్ లో ఈ మడి కూడా కోపిస్తాం." అని చెప్పింది ఝాన్సీ .






