.webp)
డ్రామా జూనియర్స్ సీజన్ 9 లో ముస్కాన్ మంచి హుషారున్న లేడీ పిల్లల పరిగెడుతూ ఇంటరెస్టింగ్ స్కిట్స్ చేసి జడ్జెస్ ని మెప్పిస్తోంది. రీసెంట్ గా ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ముస్కాన్ చిన్నప్పటి రోజా గెటప్ లో వచ్చి ఆమెలానే అనుకరించి చేసి చూపించింది. దాంతో జడ్జెస్ ఫిదా ఇపోయారు. స్టేజి మీదకు వచ్చి కాపాడండి అంటూ అరిచేసరికి "ఎవరమ్మా నువ్వు అంత భయస్తురాలిలా ఉన్నావ్ " అంటూ సుధీర్ వచ్చాడు. "నా పేరు రోజా అండి " అంది. అంతే సుధీర్ కింద పడిపోయి "రోజానా కాపాడండి " అంటూ కౌంటర్ వేసాడు. "అమ్మో చీమ చీమ" అంటూ స్టేజి మీద గెంతింది ముస్కాన్ "ఏమయ్యిందమ్మా " అని అడిగాడు.
అమ్మో చీమకు కూడా హాని చేయడం రాదండి" అంది ముస్కాన్. ఇంతలో బొమ్మాళి బ్రదర్స్ వచ్చారు. "ఎవరు బాబు నువ్వు " అంటూ స్టేజి మీద ఉన్న ఒకతన్ని అడిగాడు . "ఆ సందు చివర మీ చెల్లిని గోల చేసింది నేనేరా " అన్నాడు అతను. "రోజా వద్దు రోజా " అన్నాడు ఒక బ్రదర్. అంతే ఆ గోల చేసిన వాడిని కింద పడేసి కుమ్మేసింది చిన్న రోజా అలియాస్ ముస్కాన్. "రోజా అంటే ఫ్లవర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్ " అన్నారు బొమ్మాళి బ్రదర్స్. ఇక తర్వాత స్టేజి మీదకు ఫ్లవర్ బొకేతో అనిల్ రావిపూడి, శ్రీకాంత్ వచ్చారు. "అనిల్ గారు మా చెల్లి గురించి ఒక్కమాట చెప్పండి " అన్నారు బొమ్మాళి బ్రదర్స్ ."ఆవిడొక గయ్యాళి అని ఇలా ఎవరన్నా చెబితే అస్సలు నమ్మకండి " అన్నారు అనిల్ రావిపూడి. "అసలు ఆ నాలిక అనేది ఉందా లేదా అన్నట్టు ఉంటుంది" అన్నారు అనిల్.
ఇక సుధీర్ ఐతే "అప్పటి రోజా గారి గురించి చెప్పండి " అంటూ శ్రీకాంత్ ని అడిగాడు. "ఇంత సాఫ్ట్ అమ్మాయి ఎలా పైకొస్తుందా అనుకునేవాడిని " అనేసరికి బాలయ్య డైలాగ్ ఆ చిటికెలు అనేది బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. "ఇలాంటి వాళ్ళ వల్లే నేను ఇలా తయారయ్యా . లేకపోతే చాలా సాఫ్ట్ గా ఉండేదాన్ని" అని రోజా చెప్పారు. "ఫస్ట్ మూవీలో నా అమాయకత్వం చూసి సెల్వమణి గారు పడిపోయారు. పాపం " అంటూ సిగ్గుపడిపోతూ నవ్వేసరికి "మీరే పాపం అంటే థాంక్యూ మేడం " అన్నాడు సుధీర్.




.webp)
.webp)
