Home

»

Tv News

వయసుతో పాటు వచ్చిన మార్పులపై అనసూయ బోల్డ్ కామెంట్స్!

Jun 9, 2026 5:00PM

ఏ పని చేయాలన్నా వయసు బట్టే ఉంటుంది. కోపం ఆనందం దుడుకుదనం ఇవన్నీ వయసుతో పాటు మార్పులు సంతరించుకుంటూ ఉంటాయి. 20 , 30 లో ఉన్న తొందరపాటు తనం 40 లోకి వచ్చేసరికి ఉండదు. ఇప్పుడు అదే విషయాన్నీ అనసూయ చెప్పుకొచ్చింది. ఇంతకూ ఎం చెప్పిందంటే " అలా స్క్రోల్ చేస్తూ ఉంటే  స్కై ఇన్ ది కర్బ్ అనే స్టోరీ కనిపించింది. దాన్ని షేర్ చేశా. మంచి పనులు చేసినా జడ్జ్ చేసేవాళ్ళు ఉంటారు అనేది ఇందులో తెలుస్తుంది.  ఆ వీడియోలో ఒక వాక్యం ఉంటుంది. తిట్టిన ఆ జనాలే రెండో రోజు పొగుడుతారు. అప్పుడే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం నేను నా ఆలోచనలు నా విధానాలు ఇప్పటికీ  అలాగే ఉన్నాయి.

అప్పట్లో ఒక ఇష్యూ కోసం రైజ్ చేసిన పాయింట్ కి తలా తోక లేకుండా ఇప్పటికీ కంపేర్ చేస్తున్నా అప్పుడు ఉన్న అగ్రేషన్ ఇప్పుడు నాకు లేదు. ఎందుకిలా చేశారు, మీరు మీకెంత ధైర్యం, ఎలా వెళ్తారు మీరు అంటూ కోపంతో  ఇలా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు హాట్ బ్లడ్. అలాగే ఎర్లీ 30 స్ . ఇప్పుడు ఎర్లీ 40 స్ . ఇప్పుడు తెలివి పెరుగుతుంది ఆలోచన పెరుగుతుంది. మీ ఆలోచనలు కూడా మారిపోతాయి. లాస్ట్ వీక్ అనుకున్నది ఇప్పుడు అనుకున్నది ఒకేలా ఉండదు. నాకు ఒకప్పుడు నచ్చని సినిమా ఇప్పుడు నచ్చుతుంది. ఒకప్పుడు నచ్చిన సినిమా ఇప్పుడు చూస్తే ఇదేం సినిమా అప్పుడు ఎలా అసలు నచ్చింది అనిపిస్తుంది. డ్రెస్ విషయంలో ఫుడ్ విషయంలో కూడా. ఒకప్పుడు నాకు కాప్సికం అస్సలు నచ్చేది కాదు. కానీ ఇప్పుడు చాలా ఇష్టంగా అన్ని వెజిటబుల్స్ తింటాను. అంటే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. కానీ తప్పు , రైటు అన్న విషయాలు మాత్రం అస్సలు మారవు కదా. నువ్వు చెప్పే విధానంలోనే ఎదుటి వాళ్ళ మార్పు అనేది ఆధారపడి ఉంటుంది. అది చూడాలి కదా " అంటూ అనసూయ ఎర్లీ మార్నింగ్ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com