.webp)
ఢీ - 20 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. "ఈ వారం మా కంటెస్టెంట్లు ఆడడానికి కాదు పోరాడడానికి వస్తున్నారు. ఒక్కో మెంటర్ ఒక్కో కంటెస్టెంట్ ని ఎంచుకున్నారు. మీ మీ టీమ్స్ కి మీ టిప్స్ మీ బెస్ట్ విషెస్ చెప్పండి అన్నాడు నందు. ఢీ -20 లో సూపర్ క్వాలిఫైయర్ అని చెప్పేసరికి స్టేజి మీదకు సిద్దు - సోనియా వచ్చారు. వెంటనే ఫైమా కూడా వచ్చి సిద్దు షర్ట్ పట్టుకుని "ఇక్కడ నేనే బెస్ట్ మెంటర్ ని" అని అరిచి చెప్పింది. వెంటనే సోనియా రియాక్ట్ అయ్యింది "ఫైమా కొంచెం దూరమెల్లవా ..వామిటింగ్ వస్తుంది సిద్ధుకి " అని చెప్పింది. దాంతో ఆది రియాక్ట్ అయ్యాడు. "నిన్ను చూస్తేనే రాలేదు ఆ అమ్మాయిని చూస్తే ఏమొస్తది " అన్నాడు. తర్వాత ఆది రాజుకి టిప్స్ చూపించాడు. "రాజు నేనొక నాలుగు చూపిస్తా అవి కాకుండా నువ్వు ఏదైనా చెయ్ " అన్నాడు. "టిప్స్ ఎం లేదు.
.webp)
జతిన్ మాష్టర్ ఫ్లిఫ్స్ కి ఫేమస్ కదా ఇక్కడి నుంచి ఫ్లిప్ వేస్తె అక్కడికి వెళ్ళాలి అక్కడ వేస్తె ఇక్కడికి రావాలి" అన్నాడు సిద్దు. "నువ్వు ఇక్కడ నుంచి ఫ్లిప్ వేసి మణికొండ వెళ్ళారా నీకు దణ్ణం పెడతాను " అన్నాడు ఆది. ఇక ఫైనల్ లో శ్రీసత్య ఇంకో డాన్సర్ కలిసి రెండు రెడ్ ఫ్లాగ్స్ ఊపుతూ ఉన్నారు ఆది ఎద్దులా దూసుకొచ్చాడు. "నువ్వు తప్పించుకోవాలి నువ్వెంటి బుల్ ని రారా అంటావ్ " అని నందు శ్రీసత్యని అడిగాడు. "ఈ అమ్మాయి ఎందుకో కో-ఆపరేట్ చేస్తుందయ్యా" అన్నాడు ఆది. ఫైనల్ గా సంకేత్ - రాజు కలిసి జోడిగా పెర్ఫార్మ్ చేశారు.
"ఈ ఢీ 1 నుంచి 20 వరకు ఈ స్టేజి మీద 2 వేల పెర్ఫార్మెన్స్ లు అయ్యుంటాయి. 1999 ఒక వైపు ఈ ఒక్క పెర్ఫార్మెన్స్ ఒక వైపు " అంటూ విజయ్ బిన్నీ మాష్టర్ చెప్పారు. వీళ్ళ టీమ్ కి ఒక పేరు కూడా పెట్టారండి అని చెప్పాడు చిట్టి మాష్టర్. ఒక విరాట్ కోహ్లీ ఒక ధోని వస్తే ఎలా ఉంటదో అలా ఉంటది అని చెప్పాడు చిట్టి. తర్వాత ఆది ఒక విరాట్ కోహ్లీ ఒక ధోని ఒక డేవిడ్ షెప్పర్డ్ అంటూ ఆది సెటైర్ వేసాడు.





