Home

»

Tv News

ఇమ్ముని సెక్సీగా చూడాలనుంది... బ్యూటీ విత్ నో బ్రెయిన్ రీతూ

Mar 13, 2026

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో శ్రీముఖి ఇమ్ము ఫోటో చూపిస్తూ వెనక రాసిన కామెంట్ చదివింది. "తినేదంతా వాగడానికే సరిపోతుంది. కానీ పొట్ట మాత్రం తగ్గట్లేదు" అని చెప్పి ఆ కామెంట్ ని ఎవరు రాసారో గెస్ చేయమంది టాస్క్ ఇచ్చింది. "అంత తెలుగు గౌరవ్ కి రాదు. అంత తెలివి రీతుకి లేదు. ఇది రాసింది దమ్ము శ్రీజ రాసింది అనుకుంటున్నా " అని చెప్పాడు ఇమ్మానుయేల్.

వెంటనే శ్రీముఖి " శ్రీజ ఎందుకు ఇలా రాయాలనిపించింది" అని అడిగింది. "నాకు ఇమ్ముని సెక్సీగా చూడాలనిపిస్తోంది." అంటూ నల్ల కళ్ళజోడు లోంచి చూస్తూ చాల పోష్ గా చెప్పింది. "ఫస్ట్ అద్దాలు తీస్తే కనబడుతుంది" అన్నాడు. ఆ మాటకు అందరూ నవ్వేశారు. తర్వాత కళ్యాణ్ పడాల పిక్ చూపించి "వీడు చాల కంత్రి గాడు" అని శ్రీముఖి చదివే లోపే "వాడే రాసుకుని ఉంటాడు" అంటూ ఇమ్మానుయేల్ క్లారిటీ ఇచ్చాడు.

తర్వాత సాయి శ్రీనివాస్ ఫోటో చూపించి "నువ్వు నాకు నచ్చావ్ " అంటూ మూడు హార్ట్స్ వేశారు అంటూ శ్రీముఖి చెప్పి ఆ పిక్ ని చూపించింది. "శ్రీజ రాసింది " అంటూ ఇమ్ము అనేసరికి "ఏ ఛి నేను రాయల " అంది శ్రీజ. తర్వాత రీతూ పిక్ చూపించి "బ్యూటీ విత్ నో బ్రెయిన్ " అంటూ వెనక ఉన్న కామెంట్ ని చదివింది శ్రీముఖి. "కళ్యాణ్ పడాల" అయ్యుంటాడు అంటూ ప్రియా ఆన్సర్ ఇచ్చింది.

ఐతే ఈ కామెంట్ రాసింది ఇమ్మానుయేల్ అంటూ శ్రీముఖి అనౌన్స్ చేసేసరికి రీతూ ఇమ్ము వెంటబడింది. "నువ్వు ఇలా రాస్తావని నేను అనుకోలేదు" అంది. "నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నిన్ను బ్యూటీ అని రాస్తానని " అంటూ ఇమ్ము చెప్పాడు. బిబి కామనర్స్ వెర్సెస్ బిబి సెలబ్రిటీస్ థీమ్ తో ఈ వీక్ ఎపిసోడ్ రాబోతోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com