
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-978 లో.. అపర్ణ, ఇందు, రేఖ అందరు కలిసి మాట్లాడుకుంటారు. గొప్ప బిజినెస్ మ్యాన్ ఇంట్లో వంట చేయడానికి ఇందు ఒప్పుకుందని అపర్ణతో రేఖ అనగానే తను షాక్ అవుతుంది. అది నిజం కాదు.. తను ఎప్పుడూ అలా అనదు అని అపర్ణ అంటుంది. అందరి చెవులు పగిలిపోయేలా, ఎవరికి భయపడకుండా నిజం చెప్పమని అపర్ణ అడుగగా నేను ఒప్పుకున్నానని ఇందు అనగానే అపర్ణ షాక్ అవుతుంది. ఎందుకు ఇలా చేశావని అపర్ణ అనగానే నేను మాట్లాడతాను పదా అని అపర్ణని గదిలోకి తీసుకొని వెళ్ళి మాట్లాడుతుంది ఇందు.
అతను నాకు ముందే తెలుసు అని ఇందు చెప్తుంది. అవునా ఎలాగా అని అపర్ణ అడుగగా.. నేను దారిలో వస్తుంటే అతడి కార్ యాక్సిడెంట్ అయింది. నేను కాపాడాను అని ఇందు జరిగింది మొత్తం చెప్తుంది. అయితే మరి వాళ్ళింటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావని అపర్ణ అడుగగా నేను జాబ్ చేయడానికి ఒక అవకాశం దొరికింది అని కావ్య చెప్తుంది. మరోవైపు రాజ్ , అతడి ఫ్రెండ్ కలిసి మందు తాగడానికి పబ్ కి వస్తారు. కానీ వారి దగ్గర డబ్బు ఉండదు. అప్పుడే రాజ్ ఫ్రెండ్ కి ఒక ఐడియా వస్తుంది. మీ తమ్ముడి వీక్ నెస్ నాకొకటి తెలుసు.. దాన్ని నేను క్యాష్ చేసుకుంటున్నానని అతడు అనగానే అలా వద్దు అని రాజ్ అంటాడు.
మరి మనం పార్టీ చేసుకోవడానికి డబ్బులు ఎలా అని రాజ్ ని వాళ్ళ ఫ్రెండ్ అనగానే సరే అని అంటాడు. ఆ తర్వాత రాజ్ వాళ్ళ ఫ్రెండ్ వెంకీకి కాల్ చేసి.. మీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చింది తొందరగా రా అని అంటాడు. ఆ తర్వాత రాజ్ వాళ్ళ తమ్ముడు వెంకీ పబ్ కి వస్తాడు. ఇక రాజ్ వచ్చి వైన్ గ్లాస్ వెంకీ చేతిలో పెట్టి ఒక సెల్ఫీ తీస్తాడు. అందులో వెంకీ చేతిలో వైన్ గ్లాస్ ఉంటుంది. దాంతో పర్స్ ఇక్కడ పెడతావా.. ఈ ఫోటో నాన్నకి పెట్టమంటావా అని రాజ్ అనగానే వెంకీ భయపడి పర్స్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు మందు ఆర్డర్ ఇచ్చి తాగుతుంటారు. ఇక జాబ్ ఇప్పిస్తానని ఇందుకి ఒకడు చెప్పడంతో తను పబ్ కి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







