శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ పెరగాలంటే ఇంద్రజను తీసేయాలి
on Apr 1, 2025
ప్రతీ ఆదివారం ఆడియన్స్ అలరిస్తున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ షోలో ఫిక్స్డ్ గా హోస్ట్ రష్మీ ఉంది జడ్జ్ గా ఇంద్రజ ఉంది. ఐతే నూకరాజు ఇంద్రజాను పట్టుకుని అనరాని మాట అనేశాడు. ఈ షో లేటెస్ట్ ప్రోమో చూస్తే అసలు ఏమన్నాడో అర్ధమవుతుంది. నూకరాజు ఇందులో వాస్తు పండిట్ గా గెటప్ వేసుకుని వాస్తు చెప్పడానికి వచ్చాడు. రాగానే "ఇంద్రజ గారి ఇంటికి గుమ్మడికాయ కట్టా ఆవిడ 116 రూపాయలు ఇచ్చింది" అన్నాడు. సూపర్ కదా నిజంగా అంటూ పక్కనే ఉన్న నరేష్ అనేసరికి "ఏంటి సూపర్ అంటున్నావ్... గుమ్మడికాయకు 200 లు అయ్యింది" అంటూ నిష్ఠూరాలు పోయాడు నూకరాజు.
"ఇప్పుడు ఈ షో రేటింగ్ అలా పెరిగిపోవాలంటే ఎం చేయాలి గురువుగారు" అన్నాడు నరేష్. "ఏముంది ఇంద్రజాను తీసేయాలి" అన్నాడు నూకరాజు. దానికి ఇంద్రజ షాక్ కొట్టినట్టు నోరెళ్లబెట్టింది. "తీసేయాలి మీన్స్ ఆమెను అక్కడి నుంచి తీసేసి ఇంకొంచెం ముందుకు తీసుకురావాలి ఆమె సీటును" అన్నాడు. తర్వాత కొన్ని డైలాగ్స్ ఇచ్చి ఆ డైలాగ్ ఎవరికీ సెట్ అవుతుందో అక్కడ వాళ్ళ ఫోటో పెట్టాలి అని రష్మీ చెప్పింది. ఐతే "ఆమె పాడితే కోయిల పట్టినట్టు ఉంటుంది" అన్న డైలాగ్ కి అంజలి పవన్ వెళ్లి ఇంద్రజ ఫోటో అంటించింది. వెంటనే ఇంద్రజ "కోయిల పాట బాగుందా " అనే పాటను పాడి అలరించింది. ఇక ఈ షోకి తమన్నా భాటియా వచ్చి కొన్ని డైలాగ్స్ చెప్పి షోలో అందరినీ నవ్వించారు. తర్వాత ఆదర్శ్ ఛత్రపతి శివాజీ గెటప్ లో వచ్చి పెర్ఫార్మెన్స్ చేసేసరికి "ఒక కింగ్ ఉంటారంటే ఇలా ఉంటారేమో అనిపించింది" అంటూ ఆదర్శ్ ని మెచ్చుకున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
