చెప్పు తెగుద్ది...అక్కా చెల్లెళ్ళు లేరా నీకు...రష్మీ వార్నింగ్..
on Apr 1, 2025
జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఫుల్ కామెడీగా ఉండబోతోంది అన్న విషయం అర్ధమవుతోంది. ఇందులో బులెట్ భాస్కర్ - వర్ష చేసిన కామెడీ కాస్తా రష్మీ మీదకు మళ్ళేసరికి బులెట్ భాస్కర్ కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది రష్మీ. భాస్కర్ - వర్ష స్కిట్ చేశారు. "మన పెళ్లికి ఖుష్బూ గారు, శివాజీ గారు వచ్చారు కానీ రష్మీ రాలేదేమిటి" అని వర్ష అడిగింది. దానికి బులెట్ భాస్కర్ "మన పెళ్లి మార్చ్ 1 న జరిగింది. అది పెన్షన్ తీసుకునే రోజు అని తెలుసు కదా. ఏ 2 నో 3 నో పెళ్లి చేసుకుంటే పిలిచే వాళ్ళం" అన్నాడు. దానికి రష్మీ కౌంటర్ వేసింది. అంటే మీరు కూడా మీ పెన్షన్ ని మిస్ అయ్యారన్నమాట అనేసింది. ఆ మాటకు వర్ష రష్మీకి ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చేసింది.
తర్వాత బులెట్ భాస్కర్ పక్కకు రా అన్న లెక్కలో కళ్ళతో సైగ చేసాడు. ఆ సైగకు ఫుల్ ఫైర్ అయ్యింది రష్మీ. "చెప్పు తెగుద్ది. సిగ్గు సెరం లేదా.. మీ ఇంట్లో అక్కా చెల్లెల్లు లేరా." అని అడిగింది. "వదిన లేదని బాధపడుతున్నా" అన్నాడు భాస్కర్. దానికి రష్మీ, శివాజీ నవ్వేశారు. ఇక ఈ స్కిట్ లో నాటీ నరేష్ ఐతే భాస్కర్ ని పిచ్చకొట్టుడు కొట్టాడు. "తినే ప్రతీ మెతుకు మీద వాడి పేరు రాసి ఉంటుంది తెలుసా" అన్నాడు నరేష్.."దీని మీద బాస్మతి" అని రాసి ఉంది అంటూ కౌంటర్ వేసాడు భాస్కర్. ఆ మాటకు చెంపల మీద దబిడిదిబిడి వాయించాడు నరేష్. ఇక ఈ షో ప్రోమోలో రామ్ ప్రసాద్ స్కిట్ లో సీనియర్ కమెడియన్ షకలక శంకర్ కనిపించాడు. కానీ ఒక్క డైలాగ్ కూడా చెప్పినట్టు చూపించలేదు. దాంతో ఒక నెటిజన్ ఫైర్ అయ్యారు. సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ కామెంట్ చేశారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
