
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -55 లో.... మాధవ దగ్గరికి గాయత్రీ వస్తుంది. ఒసేయ్ నువ్వు నాకొక చిన్న హెల్ప్ చెయ్యాలని మాధవ అడుగుతాడు. నువ్వు అడుగకూడదు ఆర్డర్ వేయాలని గాయత్రీ అంటుంది. ఇంట్లో అందరు మగవాల్లే అవ్వడంతో మహాకి ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు అప్పుడప్పుడు వచ్చి తనతో మాట్లాడమని గాయత్రితో మాధవ చెప్తాడు. తోటికోడలు కాస్త తోడుగా ఉండమంటావ్ అంతే కదా సరే బావ అమ్మ లేనప్పుడు వచ్చి ఉంటానని గాయత్రి చెప్తుంది. మరొకవైపు హారిక, మహా వాళ్ళ అమ్మ లలిత మాట్లాడుకుంటారు. సర్టిఫికెట్ల కోసం మహా నీకు ఫోన్ చేసిందని అన్నావ్ కదా తనకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను తన మనసు మార్చి ఇక్కడే ఉంచకోవచ్చని హారికతో లలిత అంటుంది.
మహాకి హారిక ఫోన్ చేసి మహా సర్టిఫికెట్లు కోసం ఇంటికి రా ఇంట్లో మావయ్య మీ అన్నయ్య లేడని చెప్తుంది. పక్కనున్న లలిత తనతో పాటు ఎవరిని తీసుకొని రావద్దని చెప్పమని చెప్తుంది. హారిక ఫోన్‌లో అలాగే చెప్తుంది. మా వదిన ఫోన్ చేసి సర్టిఫికెట్లు కోసం ఇంటికి రమ్మంది వెళ్తానని మహా చెప్తుంది అప్పటికే చక్రికి డౌట్ వస్తుంది. వద్దని చక్రి అంటాడు. నా డ్రీం కోసం సర్టిఫికెట్లు అవసరం అని మహా అంటుంది. నీకు తోడుగా అయినా వస్తానని చక్రి అనగానే వద్దు గొడవ అవుతుందని మహా అంటుంది. లేదంటే కన్నా ని తీసుకొని వెళ్ళమని మాధవ చెప్తాడు. అందుకు మహా సరే అంటుంది. మాధవ ఆటో తీసుకొని వస్తాడు. మహాతో కన్నాని పంపిస్తాడు మాధవ. మరొకవైపు మహాని అక్కడే ఉంచుతారని భయంతో కేశవ దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు చక్రి.
అంత మంచి అమ్మాయి నీకెలా పడింది రా ఆని కేశవ అనగానే చక్రి కి కోపం వస్తుంది. మరొక వైపు మహా, కన్నా ఇంటికి దగ్గరగా వెళ్లి హారికకి ఫోన్ చేస్తారు. ఇంట్లోకి రమ్మని హారిక చెప్తుంది. గేట్ లోపలికి వెళ్ళగానే హారిక, లలిత ఉంటారు. ఇతను ఎవరు అని లలిత, కన్నాను ఉద్దేశ్శించి అంటుంది. తను మా వదినమ్మ అని కన్నా అంటాడు. అతన్ని గేట్ బయటే ఉండమనని లలిత అనగానే పర్వాలేదు బయట ఉంటానని చెప్పి కన్నా గేట్ బయటకు వెళ్తాడు. ఆ తర్వాత మహా లోపలికి వెళ్తుంది. వెళ్లేసరికి వాళ్ళ నాన్న, అన్నయ్య ఉంటారు. ఇంట్లో ఎవరు లేరని వాళ్ళ వదిన చెప్పిన మాటలు మహా గుర్తుచేసుకుంటుంది. వాళ్ళ నాన్నని చూసి ఎమోషనల్ అవుతుంది మహా. అయింది ఏదో అయింది ఇక్కడే ఉండమని లలిత అంటుంది. నా డ్రీం నెరవేరాలంటే నేను అక్కడే ఉండాలని మహా అంటుంది. నీకు సర్టిఫికెట్లు కావాలంటే ఇక్కడే ఉండాలని మహా వాళ్ళ నాన్న షరతు పెడతాడు. మరి మహా ఏ నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.








