
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -961 లో.. అప్పుకి ఇన్‌స్పెక్టర్ ధనుంజయ్ కాల్ చేసి రౌడీలు ఎంత అడిగినా నిజం చెప్పడం లేదని చెప్తాడు. దాంతో సరే మేం వస్తున్నామని అప్పు చెప్తుంది. ఇంట్లో హాల్లో అందరు కూర్చొని ఉంటారు. కావ్య పాపకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తారు. ఇందిరాదేవి ఎలా ఉందని రాజ్ అంటాడు. నా పేరా వద్దు అది.. పెద్దయ్యాక ముసలిదాని పేరు పెట్టారని నన్ను తిట్టుకుంటుందని ఇందిరాదేవి అంటుంది. నీ పేరులో సగం ఇందు ఎలా ఉందని రాజ్ అంటాడు. బాగుందని ఇంట్లో అందరు అంటారు.
అప్పు, కళ్యాణ్, పాపని తీసుకొని వెళ్తుంటే.. ఎక్కడికి రా బారసాల ఫంక్షన్ కి రావడం లేదా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. వస్తాము కానీ గుడికి వెళ్లి వస్తామని కళ్యాణ్ చెప్తాడు. మరొకవైపు రుద్రాణికి రేఖ ఫోన్ చేసి.. మమ్మీ ఆ అప్పు వాళ్ళు రౌడీల దగ్గరికి వెళ్తున్నారు. అప్పు అడిగితే వాళ్ళు ఖచ్చితంగా నిజం చెప్తారు. నీ పేరు చెప్తారని రేఖ చెప్తుంది. అప్పు, కళ్యాణ్, రౌడీల దగ్గరికి వెళ్తారు. అప్పు వాళ్ళని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంది. దాంతో రౌడీలలో ఒకడు తన ఫోన్ లో ఉన్న రుద్రాణి ఫోటో చూపించి ఈవిడే డబ్బు ఇచ్చి పాపని చంపమని చెప్పిందని అంటాడు. నాకు ముందు నుండి రుద్రాణి మీద డౌట్ ఉందని కళ్యాణ్ తో అప్పు అంటుంది. అప్పు, కళ్యాణ్ మినిస్టర్ ఇంటికి బయల్దేర్తారు. మినిస్టర్ ఇంట్లో బారసాల ఫంక్షన్ కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంకా కావ్య వాళ్ళు రాలేదేంటని తులసి అడుగుతుంది. వాళ్ళు తప్పకుండా వస్తారని మినిస్టర్ చెప్తాడు. అంతలోనే కావ్య వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. వచ్చినందుకు థాంక్స్ అని మినిస్టర్ చెప్తాడు. మాకు రావడం ఇష్టం లేదు కానీ మా అబ్బాయి ఏం అన్నాడో తెలుసా.. మినిస్టర్ గారు తన భార్య మీద ప్రేమతో అది చేశారు కానీ అలా చెయ్యడం అతని ఉద్దేశ్యం కాదని చెప్పాడని అపర్ణ, సుభాష్ చెప్తారు. దాంతో రాజ్ ని మినిస్టర్ గొప్పగా పొగుడుతాడు.
కావ్య పాపని నీ చేత్తో ఉయ్యాలలో వెయ్యమని తులసి అనగానే దానికి కావ్య సరే అని వేస్తుంది. మరొక వైపు అప్పు, కళ్యాణ్ ఇద్దరు నిజం తెలుసుకున్నారని రుద్రాణి వాళ్ళని ఆక్సిడెంట్ చేసి చంపాలని రౌడీలకి చెప్తుంది. అప్పు, కళ్యాణ్ వెళ్తుంటే ఆక్సిడెంట్ చేయిస్తుంది రుద్రాణి. తరువాయి భాగంలో రుద్రాణి మినిస్టర్ ఇంటికి వచ్చి ఇందిరాదేవిని మళ్ళీ ఇంటికి వస్తానని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడే అప్పు, కళ్యాణ్ చిన్న గాయలతో మినిస్టర్ ఇంటికి వచ్చి అన్ని నిజాలు చెప్తారు. దాంతో రుద్రాణిని కావ్య తన చెప్పుతో కొడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







