Brahmamudi : రాజ్ కి తనని పరిచయం చేసుకున్న కళావతి.. క్యారేజ్ పంపించిందిగా!
on Mar 27, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -679 లో..... కావ్య ఇలా బయటకు వెళ్తుంటే మన ఇంటి పరువు ఏం కావాలని రుద్రాణి అంటుంది.. అందుకు తనకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది కావ్య. అదంతా గొడవ ఎందుకు అమ్మ నీకు ఏం కావాలో చెప్పు తీసుకొని వస్తామని సుభాష్ అనగానే.. అంటే మీరు కూడా ఆలా అంటున్నారా అని కావ్య ఫీల్ అవుతుంది. అదేం కాదమ్మా నీకు హెల్ప్ చేద్దామని అని సుభాష్ అంటాడు.
ఎప్పుడు.. ఎవరు నన్ను నమ్మరు.. ఏదో ఒకటి సాధించాకే నన్ను నమ్ముతారు.. మొదటి నుండి ఇదే జరుగుతుంది. నన్ను ఎవరు నమ్మకపోయినా నేను వెళ్ళాల్సిన చోటుకి వెళ్తాను.. సాధించాల్సింది సాధిస్తానంటూ చెప్పేసి కావ్య వెళ్ళిపోతుంది. ఎవరేం మాట్లాడరా అంటూ రుద్రాణి అంటుంది. నా కోడలు ఆశ నిజం అయితే బాగుండు అని అనుకుంటున్నానని అపర్ణ అంటుంది. కావ్య నెల రోజలు టైమ్ అడిగింది కదా మళ్ళీ ఎందుకు అలా గొడవ చెయ్యాలని చూస్తావంటూ రుద్రాణిని ఇందిరాదేవి తిడుతుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వెళ్తుంది. తనని చూసి రాజ్ షాక్ అవుతాడు. మీరా లోపలికి రండీ అంటూ పిలుస్తాడు. కావ్య లోపలికి వెళ్తుంది. హాస్పిటల్ లో మీ అడ్రెస్ కనుక్కొని వచ్చానని కావ్య చెప్తుంది. అప్పుడే యామిని వాళ్ళ అమ్మ కావ్య దగ్గరికి వస్తుంది. ఎవరు ఆ అమ్మాయి అని రాజ్ ని అడుగుతుంది. మొన్న సేవ్ చేసాను అని చెప్పాను కదా ఈ అమ్మాయే అని రాజ్ చెప్తాడు.. కాఫీ తీసుకొని రావాలా అంటూ వైదేహి బాగా మాట్లాడుతుంది. అప్పుడే యామిని వస్తుంది. కావ్యని చూసి షాక్ అవుతుంది.
మీ పేరు ఏంటని కావ్యని రాజ్ అడుగగా.. కావ్య కళావతి అని చెప్పగానే బాగుందని అంటాడు. కావ్య, రాజ్ లు మాట్లాడుకుంటుంటే యామినికి టెన్షన్ మొదలు అవుతుంది. కాసేపటికి కావ్య వెళ్ళిపోతుంటుంది. రాజ్ పై నుండి చూస్తాడు. తరువాయి భాగంలో రాజ్ కి కావ్య క్యారెజ్ కడుతుంది. అది రుద్రాణి చూస్తుంది. ఆ తర్వాత రాజ్ కి ఒకతను క్యారేజ్ తీసుకొని వెళ్లి ఇస్తాడు. కళావతి మేడమ్ పంపిందని చెప్పగానే రాజ్ ఓపెన్ చేసి తింటాడు. చాలా బాగున్నాయంటూ రాజ్ తింటుంటే యామినికి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
