డాన్స్ ఐకాన్ షోకి "కోర్ట్" మూవీ టీమ్...
on Mar 26, 2025
డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఇది జడ్జిమెంట్ ఎపిసోడ్ . అందుకే యాంకర్ ఓంకార్ ఇద్దరు సెన్సేషనల్ గెస్టులని పిలిచారు. వాలేవారంటే రీసెంట్ గా రిలీజై హిట్ కొట్టిన "కోర్ట్" మూవీ హీరోహీరోయిన్స్ ఐన రోషన్, శ్రీదేవి. వాళ్ళను అలాగే వాళ్ళ పేరెంట్స్ ని కూడా తీసుకొచ్చారు. రాగానే వాళ్ళతో ఆ మూవీలో సాంగ్ కి డాన్స్ చేయించారు. అలాగే శేఖర్ మాష్టర్, ఫారియా కూడా వెళ్లి స్టెప్పులేశారు. తర్వాత వాళ్లిద్దరూ కలిసి సినిమాలో ఉన్న "మనసనే మెటీరియల్" డైలాగ్ ని రిక్రియేట్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేశారు.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ఇంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆ ప్రౌడ్ మూమెంట్ కి డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో పేరెంట్స్ మధ్యలో సెలెబ్రేట్ చేసుకోవాలి అని చెప్పాడు ఓంకార్. జడ్జ్మెంట్ ఎపిసోడ్ కాబట్టి రోషన్, శ్రీదేవికి కోర్ట్ లో జడ్జ్ వేసుకుని డ్రెస్ ని పైన హాట్ ని పెట్టి ఆహా తరపున ఒక సర్టిఫికెట్ ప్రెజెంట్ చేసాడు. ఇక కోర్ట్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్చ్ 14 న చిన్న మూవీగా పోక్సో చట్టం నేపథ్యంగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరింది. శ్రీదేవి, రోషన్ జోడిగా నటించిన ఈ మూవీలో వీళ్ళ నటన శివాజీ, సాయి కుమార్, ప్రియదర్శి డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇక ఈ మూవీకి నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈ చిత్రంలో హీరోహీరోయిన్స్ అనే కాన్సెప్ట్ లేనే లేదు..కంటెంట్ మాత్రమే ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
