ప్రియను ఏడ్పించిన లోబో!
on Sep 28, 2021
'బిగ్ బాస్-5' ప్రోగ్రామ్ ప్రారంభమై మూడు వారాలు గడిచింది. నాలుగో వారంలోకి ఎంటరైంది. ఆల్మోస్ట్ షోలో ఫైర్ బ్రాండ్స్ ఎక్కువమంది కనిపిస్తున్నారు. కానీ, అందరిలో ప్రియ మాత్రం డిఫరెంట్. ఆమె సెన్సిటివ్ కింద కనిపిస్తున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. లాస్ట్ వీక్ లహరి విషయంలో రవి మాట మార్చినప్పుడు 'నువ్ అన్నావ్ బ్రో' అని ప్రియ వెక్కి వెక్కి ఏడ్చింది. మరోసారి మళ్ళీ అటువంటి సీన్ రిపీట్ అయ్యింది. ఈసారి ప్రియను ఏడ్పించినది లోబో.
నామినేషన్స్ సమయంలో తన ప్రేమకథ చెబుతున్నప్పుడు ఏదో సినిమాలా ఉందని ప్రియ అన్నదని, అది తనను చాలా బాధించిందని లోబో చెప్పాడు. ప్రియ వివరణ ఇవ్వబోతే గట్టిగా అరిచాడు. తర్వాత ఏడ్చాడు. అప్పుడు 'మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకటి మాట్లాడొద్దు లోబో' అని ప్రియ చెప్పింది. తనపై లోబో అలా అరవడంతో వెక్కి వెక్కి ఏడ్చింది. తనను నామినేట్ చేసిన లోబోను ప్రియ నామినేట్ చేసింది.
Also Read