
బిగ్ బాస్ సీజన్-10 పదో వారం ఓటింగ్ పోల్‌లో మరోసారి పెద్ద ట్విస్ట్ కనిపిస్తోంది. ఉదయం వరకు టాప్‌లో ఉన్న త్రిగుణ్‌ను ముఖేష్ మళ్లీ దాటేశాడు.ఫ్యామిలీ వీక్‌లో అమ్మ రావడం, అక్క వీడియో సందేశం తర్వాత ముఖేష్‌కి సింపథీ ఓటింగ్ బాగా పెరిగింది. హౌస్‌లో అందరు నామినేషన్‌లో ఉండటంతో ఈ వారం ఎవరు సేవ్ అవుతారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చివరి నిమిషం వరకు ఉత్కంఠగా మారింది.
తాజా ఓటింగ్ లెక్కల్లోకి వెళ్తే ముఖేష్ 30.45% ఓట్లతో (47,879 ఓట్లు) మొదటి స్థానంలోకి వచ్చేశాడు. అతడికి గట్టి పోటీ ఇస్తూ త్రిగుణ్ 29.73% ఓట్లతో (46,744 ఓట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య తేడా కేవలం 0.72% మాత్రమే, అంటే 1,135 ఓట్ల తేడా మాత్రమే. మూడో స్థానంలో దేబ్జానీ 8.17% ఓట్లతో (12,845 ఓట్లు) ఉంది. ఆ తర్వాత వర్షిణి 5.05% (7,947 ఓట్లు), అమన్ 4.33% (6,807 ఓట్లు), నరేష్ 3.88% (6,106 ఓట్లు), నీతూ 3.72% (5,855 ఓట్లు)తో ఉన్నారు. సుధీర్ 3.67% (5,772 ఓట్లు), రామ్ ప్రసాద్ 3.42% (5,377 ఓట్లు)తో దాదాపు ఒకే రేంజ్‌లో కొనసాగుతున్నారు.
డేంజర్ జోన్‌లో మాత్రం రామకృష్ణ, శివ కుమార్, శ్వేత ఉన్నారు. రామకృష్ణ 2.98% ఓట్లతో (4,685 ఓట్లు) 10వ స్థానంలో, శివ కుమార్ 2.39% ఓట్లతో (3,756 ఓట్లు) 11వ స్థానంలో, శ్వేత 2.19% ఓట్లతో (3,449 ఓట్లు) చివరి స్థానంలో ఉన్నారు. ఫ్యామిలీ వచ్చినా శ్వేతకి ఓటింగ్‌లో అది కలిసి రాలేదనే టాక్ వినిపిస్తోంది. ఎంగేజ్మెంట్‌తో సందడి చేసిన శివ కుమార్ కూడా ఇంకా డేంజర్ జోన్‌లోనే ఉన్నాడు. అయితే ఇది అనధికారిక ఆన్‌లైన్ ఓటింగ్ పోల్ మాత్రమే. అసలు జియో హాట్‌స్టార్ వోటింగ్‌తో పాటు మిస్డ్ కాల్ ఓట్లు కలిపితే లెక్క మారే ఛాన్స్ కూడా ఉంది.ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ముఖేష్, త్రిగుణ్ ఇద్దరూ సేఫ్ జోన్‌లో ఉన్నట్టే కనిపిస్తున్నా.. చివరి నిమిషంలో ఓటింగ్ మారిపోవడం బిగ్ బాస్‌లో కామనే. శ్వేత, శివ కుమార్, రామకృష్ణ ఫ్యాన్స్ ఓటింగ్ వేస్తే వాళ్లు కూడా బయటపడే ఛాన్స్ ఉంది. ఈ వీకెండ్‌లో నాగార్జున ఎవరిని సేవ్ చేస్తాడు.. ఎవరిని ఇంటి నుంచి పంపిస్తాడు అనేది చూడాలి మరి.




.webp)
.webp)
