.webp)
బిగ్ బాస్ సీజన్-10 తెలుగులో పదో వారం ఫ్యామిలీ వీక్ సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ ఎమోషన్స్‌తో నిండిపోయింది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక్కొక్కరుగా హౌస్‌లోకి అడుగుపెట్టి ఎమోషన్స్ పిండేస్తున్నారు.హౌస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఫ్యామిలీ ఎంటర్ అయ్యారు. రామ్ ప్రసాద్ కూతురు.. హౌస్‌లో ఆటాడించేసింది. ఆడుతూ పాడుతూ చలాకీగా కనిపించింది. ఇక సుధీర్ తల్లి వచ్చి తన చేతి రుచితో కొడుకు కడుపే కాదు.. హౌస్‌లో ఉన్న వాళ్లందరి కడుపూ నింపింది.
అయితే ఆ ఫుడ్ సుధీర్ తల్లి పంపిందని చెప్పకుండా సస్పెన్స్ పెట్టారు బిగ్ బాస్. ఏ కొడుకు అయినా తల్లి చేసిన వంటను గుర్తుపట్టకుండా ఉంటాడా? బిగ్ బాస్ ఈ ఫుడ్ అయితే మా ఇంటి నుంచి వచ్చిందని చెప్పగలుగుతున్నా.. కానీ నీతూ మాస్టర్.. తన భర్త నటరాజ్ మాస్టర్ పంపించారని చెప్తున్నారు. బట్ ఆ ఫుడ్ అయితే చాలా బావుంది. మా అమ్మని గుర్తు చేశారు బిగ్ బాస్ థాంక్యూ అంటూ ఎమోషనల్ అయ్యాడు సుధీర్.
అప్పుడే సుధీర్ తల్లి.. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి సర్ ప్రైజ్ చేసింది. కొడుకుని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ.. ఎమోషనల్ అయ్యింది. సుధీర్ కాలికి గాయం కావడంతో.. కాలు చూపించు అంటూ ఏడ్చేసింది. ఆ కాలు చూసి.. బాగానే ఉందని చూసిన తరువాత కానీ.. ఆ తల్లి మనసు చల్లబడలేదు. ఆ తరువాత హౌస్‌లో వాళ్లని పరిచయం చేస్తానని సుధీర్ అంటే.. అందరి పేర్లు నేను చెప్తానని అన్నది సుధీర్ తల్లి. నీతూ మాస్టర్‌ని చూసి డాన్స్‌లో మా వాడు లాస్ట్ లైన్‌లో ఉంటాడు.. మా వాడ్ని ముందుకి తెచ్చి నాలుగు స్టెప్‌లు నేర్పించండి అని కోరింది. ఆ తరువాత కొడుక్కి ప్రేమగా గోరు ముద్దలు తినిపించింది. నేను నా కొడుక్కి సుధీర్ రెడ్డి అని పేరు పెట్టుకుంటే.. మీరంతా జిగా జిగా అంటున్నారేంటి? అంటూ పెద్దగా నవ్వేసింది. అరేయ్ జిగా రారా అంటూ తల్లి పిలవడంతో హౌస్ అంతా నవ్వులతో నిండిపోయింది. ఇంతలో బిగ్ బాస్.. మీ ఇంట్లో ఉన్న సుధీర్‌కి ఈ ఇంట్లో ఉన్న సుధీర్‌కి మీరు గమనించిన తేడా ఏంటని అడిగారు. దానికి ఆమె.. ఇంట్లో కూడా ఇంతే, ఇక్కడ కూడా ఇంతే.. ఎక్కడికెళ్లినా సుధీర్ గురించి చెప్తుంటే గర్వంగా ఉందని చెప్పింది. తమ కొడుకు ఇంత దూరం వచ్చాడంటే చాలా గర్వంగా ఉందని కన్నీళ్లతో చెప్పింది సుధీర్ తల్లి.






