ఉడతలు సూపర్ హీరోస్ అని చెప్తున్న రష్మీ
on Mar 12, 2025
.webp)
రష్మీ గౌతమ్ బుల్లితెర మీద ఈ పేరు తెలియని వారు ఉండరు. రష్మీ ఒక యూనిక్ పర్సన్ అని చెప్పొచ్చు. ఎప్పుడూ మూగజీవాల కోసం ఏదో ఒక చేస్తూనే ఉంటుంది. ఆమె స్టేటస్ లో కానీ ఆ సోషల్ మీడియా పేజెస్ లో కానీ వాటికి సంబంధించిన విషయాలే ఎక్కువగా కనిపిస్తాయి . ఇక రీసెంట్ గా రష్మీ రెండు ఇంటరెస్టింగ్ పోస్టులను తన స్టేటస్ లో పోస్ట్ చేసింది. ఉడతల గురించి మనకు తెలుసు కదా..చెట్లు ఎక్కడ ఉంటె అక్కడ ఈ ఉడతలు కిచ్..కిచ్ అంటూ తిరుగుతూనే ఉంటాయి.
.webp)
ఐతే "ఈ వారం నేను ఈ ఉడతల గురించి నేర్చుకున్న అంశం ఏంటంటే ఒకవేళ పొరపాటున ఈ ఉడతలు చెట్టు మీద నుంచి పడిపోతే అవి సూపర్ హీరోస్ మాదిరి ఒక చేతి మీద నిలబడతాయట కానీ పడిపోవట" అని చెప్తూ స్టేటస్ ఒక మంచి విషయాన్నీ పోస్ట్ చేసింది. అలాగే ఇంకో స్టేటస్ చూస్తే గనక అసలే ఎండాకాలం.. జంతువులన్నీ కూడా మంచి నీళ్లు దొరక్క అల్లాడుతూ ఉంటాయి. కానీ కొన్ని నిర్మానుష్య ప్రదేశాల్లో నీళ్లు దొరక్క పాపం చాలా దాహంతో గిలగిలా కొట్టుకుంటూ ఉంటాయి. అలాంటి ఒక వీడియోని కూడా పోస్ట్ చేసింది. "జంతువులు మనల్ని ఆశీర్వదిస్తాయి...ఇతనెవరో కానీ ఇక్కడికి వచ్చే నక్కలా గుంపుల కోసం వాటి దాహం తీర్చడం కోసం ఒక పెద్ద ఐస్ క్యూబ్ ని అలాగే కొంచెం నీళ్లను కూడా పోసి వెళ్ళాడు" అంటూ ఎంతో సంతోషంతో ఈ పోస్ట్ ని పెట్టింది రష్మీ. అంటే రష్మీ ఈ వీడియో ద్వారా మీరు కూడా మూగజీవాల కోసం ఎంతో కొంత వాటర్ ని పెట్టే ఏర్పాటు చేయండి అంటూ ఇన్డైరెక్ట్ గా చెప్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



