Illu illalu pillalu : ఇంటికోడలు ఆ నిజం చెప్తుందా.. భాగ్యం డ్రామాని కనిపెట్టిన నర్మద!
on Mar 12, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -103 లో.....భాగ్యం పక్కనుండి మరి శ్రీవల్లి చేత చందుకి మిస్ కాల్ ఇప్పిస్తుంది. ఇప్పుడు అతను కాల్ చేస్తాడు. ఇలా మాట్లాడు అంటూ అన్ని చెప్తుంది. శ్రీవల్లి మిస్ కాల్ చూసుకొని చందు ఫోన్ చేసి మాట్లాడతాడు. అయ్యో ఫోన్ వచ్చిందా నెంబర్ సేవ్ చేసుకుంటుంటే కాల్ వచ్చిందని చెప్పగానే చందు ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ చేస్తే, మెసేజ్ చెయ్యమని భాగ్యం చెప్పినట్లుగా శ్రీవల్లి చేస్తుంది.
ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. చిన్నోడు, ప్రేమ ఇంకా రాలేదని వేదవతి చూస్తుంటుంది. శ్రీవల్లి మెసేజ్ చేస్తుంటే చందు సిగ్గుపడతాడు. అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లి వచ్చాము. వాళ్ళు చాలా మంచివాళ్ళు.. ఇక ముహూర్తం పెట్టుకుందామని రామరాజు అంటాడు. నాకు వాళ్లపై ఏదో డౌట్ ఉందని సాగర్ తో నర్మద అనగానే.. నువ్వు సైలెంట్ గా ఉండమని సాగర్ తనపై కోప్పడతాడు. ప్రేమ, ధీరజ్ లు ఇంటికి వస్తారు. వేదవతి పిలుస్తున్నా కూడా ఇద్దరు లోపలికి వెళ్తారు. మీరు అన్న పిలవండి అని రామరాజుతో వేదవతి అనగానే.. మోసం చేసేటోడు బయట తినడా అని రామరాజు అంటాడు. ఆ తర్వాత ఎందుకు అలా అంటున్నావ్.. ఈ పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా అంటూ నర్మదపై సాగర్ కోపంగా మాట్లాడుతాడు. సాగర్ కోపంగా నేలపై పడుకుంటాడు.
ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ లకి వేదవతి పాలు తీసుకొని వస్తుంది. ధీరజ్ డోర్ వెయ్యబోతుంటే వేదవతి ఆపుతుంది. వేదవతి బాధపడుతూ మాట్లాడుతుంటే ధీరజ్ బాధపడతాడు. తరువాయి భాగం లో సాగర్, నర్మద లు వేరు వేరుగా పడుకోవడం వేదవతి చూస్తుంది. ఎందుకు అలా ఏమైనా గొడవ జరిగిందా అని నర్మదని వేదవతి అడుగగా.. నర్మద సైలెంట్ గా వెళ్ళిపోతుంది. అదే విషయం సాగర్ ని వేదవతి అడుగుతుంది. నాపై ఒట్టే.. ఇప్పుడేం జరిగిందో చెప్పకుంటే అని వేదవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



