సుడిగాలి సుధీర్‌కి కొత్త జోడి దొరికింది... షాక్‌లో నిహారిక
on Jan 30, 2026

ఆట 2 .0 లేటెస్ట్ ప్రోమో చాలా కలర్ ఫుల్ గా ఉంది. ఇందులో డాన్సర్ అక్షత బాలయ్య తన డాన్స్ తో ఇరగదీసింది. జడ్జెస్ కి తెగ నచ్చేసి మంచి కామెంట్స్ ఇచ్చారు. ఇక ఈమె హోస్ట్ సుధీర్ మీద మనసు పడిపోయింది. "మీరంటే చాలా ఇష్టం నాకు" అంటూ ఒక గిఫ్ట్ బాక్స్ ని సుధీర్ కి ఇచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే అందులో ఒక ఖాకీ చొక్కా కనిపించింది. అది వేసుకున్నాడు. అది వేసుకుని ఆమె వైపు చూసాడు. "మీరు అంత క్యూట్ గా చూస్తే నేను మాట్లాడలేను" అనేసింది సిగ్గుపడిపోతూ అక్షత. ఆ మాటలకు విష్ణుప్రియ, రాధికా, నిహారిక కొణిదెల అంతా ఆ అంటూ నోరెళ్లబెట్టారు.
ఇక జడ్జి రాధికా ఐతే "వర్కౌట్ ఐపోయింది" అనేసారు. "మీరు పాడిన అడిగా అడిగా సాంగ్ ని తొమ్మిది సార్లు పాడితే నేను తొమ్మిది వేల సార్లు విన్నాను" అంటూ మైమరిచిపోతున్నట్టుగా ఉన్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో చెప్పేసరికి సుధీర్ ఇంకా ఏమీ మాట్లాడలేకపోయాడు. వెంటనే ఆ అమ్మాయితో కలిసి "నా వల్ల కాదె బొమ్మ" అనే సాంగ్ కి డాన్స్ చేసాడు. నిహారిక ఆశ్చర్యపోయింది. నెటిజన్స్ ఐతే సుధీర్ అన్నకి ఫైనల్ గా తన జోడి దొరికింది. సుధీర్ అన్న ఉంటె ఆట ఎపిసోడ్ ఫుల్ హిట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



