బిబి జోడి నుంచి తప్పుకున్న కీర్తి భట్.. నా కండిషన్ బాలేదు!
on Jan 30, 2026

బిబి జోడి సీజన్ 2 ప్రతీ వారం కొత్త కొత్త ట్విస్టులతో వస్తోంది. ఇక రాబోయే వారం ప్రోమో చూస్తే ఆర్జే చైతుకి జోడీగా ఇప్పటి వరకు షోలో ఉన్న కీర్తి భట్ సడెన్ గా షో నుంచి క్విట్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది. మానసికంగా నా కండిషన్ బాలేదు, ఈ విషయం చెప్పడం కూడా చాలా శ్యాడ్ గా ఉంది అంటూ చెప్పింది. కొన్ని సార్లు అన్ని విషయాలు చెప్పలేకపోతాం కదా అంది. ఏదో ఒక రోజు కం బ్యాక్ ఐతే ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ వీక్ నుంచి ఆర్జే చైతుకి జోడీగా శ్రీజ దమ్ము రాబోతోంది అంటూ హోస్ట్ ప్రదీప్ అనౌన్స్ చేసాడు. "ఎం చెప్పి ఒప్పించారు జోడీగా" అంటూ ప్రదీప్ శ్రీజని అడిగాడు. "ఎం చెప్పలేదు మంచి బాబు కాబట్టి" అంది. దాంతో శేఖర్ మాష్టర్ "అప్పుడే మంచి బాబు అని ఎలా తెలిసిపోయింది" అంటూ అడిగాడు. "ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది కదా చూడగానే పడిపోయింది సర్" అని చెప్పింది శ్రీజ. తర్వాత శ్రీసత్యకి, రీతూ చౌదరికి మధ్య మార్క్స్ విషయంలో గొడవ జరిగింది.
ఇక ఇమ్మానుయేల్ చిత్రగుప్తుడు గెటప్ లో వచ్చి కాసేపు నవ్వించాడు. "ఈరోజు ఇక్కడికి రావటానికి కారణం మెయిన్ అర్జున్ గారు. ఒక సారి ఒక చిన్న స్టెప్ వేసి యముండా" అనండి అన్నాడు. అర్జున్ అలానే అన్నాడు. "నేను చెప్తూనే ఉన్నా ఇదంతా వర్కౌట్ అవ్వదు అని మొన్నేమో వెయిటర్ గెటప్ వేసి కేజిఎఫ్ అని నమ్మించావ్. ఈరోజేమో భటుడి గెటప్ వేసి యముడిని నమ్మిస్తున్నావ్. అసలింకా ఎంతకాలం నమ్మిస్తావయ్యా " అన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



