Home

»

Tv News

Akhil Sarthak: బిగ్ బాస్ సీజన్-10 టాక్సిక్ షో.. మోనాల్ తో స్నేహం ఎప్పటికీ ఉంటుంది!

Nov 5, 2026 8:53AM

బిగ్ బాస్ తెలుగు-4  కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ తాజాగా ఇన్‌స్టాలో ప్రశ్నలు అడగండి అనే సెషన్ పెట్టాడు. జిమ్‌లో వర్కౌట్ చేస్తూ కనిపించిన వీడియోతో సెషన్ మొదలు పెట్టాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా స్పష్టంగా, సరదాగా సమాధానాలు ఇచ్చాడు. ముఖ్యంగా మోనాల్ గజ్జర్ గురించి, బిగ్ బాస్ 10 గురించి అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

అభిమానులు మోనాల్ తో ఇంకా మాట్లాడుతున్నావా, స్నేహం ముగిసిపోయిందా అని అడగ్గా మా స్నేహం ఎప్పటికీ ముగియదని అఖిల్ బదులిచ్చాడు. మరో అభిమాని మోనాల్ ఎలా ఉంది, కొన్ని రోజులుగా యాక్టివ్ గా లేదు బాగానే ఉందా అని అడిగితే దేవుడు గొప్పవాడు, ఆమెను ఎప్పుడూ ఎంతో ఆశీర్వదించాడు, ఆమె దేవుడి ప్రియమైన బిడ్డ, ఆమె పూర్తిగా బాగానే ఉంది కంగారు పడొద్దు త్వరలోనే యాక్టివ్ అవుతుందని చెప్పాడు. దీంతో వాళ్లిద్దరి స్నేహం ఇంకా బలంగానే ఉందని స్పష్టమైంది.

బిగ్ బాస్ 10 తెలుగు గురించి ఒకరు ఏంటి సంగతి అని అడిగితే ఇంకా ఉందా ఆ షో అంటూ సరదాగా సమాధానమిచ్చాడు. మరొకరు దయచేసి బిబి 10 చూడొద్దు అది ఇప్పుడు టాక్సిక్ షోగా మారింది.. ముందు బాగుండేదని అంటే అవునా ఓకే అంటూ చిన్నగా బదులిచ్చాడు. బిబి 10 ప్రస్తుతం టాక్సిక్ గా మారిందనే అభిప్రాయంతో అఖిల్ కూడా ఏకీభవించినట్లుగా అభిమానులు భావిస్తున్నారు.

ఇక బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవచ్చా అనే ప్రశ్నకు కొందరు చేసుకుంటారు.. కొందరు చేసుకోరంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. మొత్తానికి ఈ ప్రశ్నల సెషన్ తో అఖిల్ మరోసారి తన స్నేహం విలువలు ఏంటో చూపించాడు. మోనాల్ పై తనకున్న శ్రద్ధ, బిగ్ బాస్ పై తన అభిప్రాయాన్ని చాలా బహిరంగంగా చెప్పడంతో ఈ స్టోరీలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com