Home

»

Tv News

Bigg Boss 10 Telugu: ముఖేష్ వర్సెస్ త్రిగుణ్.. గెలుపెవరిది!

Nov 5, 2026 8:49AM


 

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో నిన్నటి ఎపిసోడ్ లో ముకేష్, త్రిగుణ్ మధ్య జరిగిన వల్గర్ గొడవే హైలైట్ అయింది. 9వ వారం నామినేషన్స్ లో ముకేష్ హద్దులు దాటి దేబ్జానీపై వ్యక్తిగత విమర్శలు చేశాడు. దేబ్జానీ మేడమ్ వెనకాల శివ తిరుగుతున్నాడంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో శివ, త్రిగుణ్ ఇద్దరూ ఫైర్ అయ్యారు. "డర్టీ మైండ్, వల్గర్ మైండ్ ని మూసుకుని కూర్చో" అంటూ త్రిగుణ్ ముకేష్ పై విరుచుకుపడ్డాడు. నోరు తెరిస్తే ఆట ఆడటం రాదు, బిహేవియర్ రాదు, ఆడవాళ్లతో మాట్లాడటం రాదు అంటూ త్రిగుణ్ ఘాటుగా కౌంటర్ వేశాడు.

ముకేష్ కూడా తగ్గలేదు. "ఈ సమాజానికి నువ్వు హానికరం, నీ పర్సనాలిటీ జీరో, నీ ఫ్రెండ్ షిప్ పై చూపించిన వాల్యూ జీరో, ఎథిక్స్ జీరో" అంటూ త్రిగుణ్ పై ఎదురుదాడి చేశాడు. దేబ్జానీ అయితే "ఐ పిటీ ఆన్ యూ ముకేష్" అంటూ ఎమోషనల్ అయింది. బిహేవియర్ ఇంపార్టెంట్, టాస్కులు, స్పీడు, బ్యాలెన్స్ కాదు అంటూ దేబ్జానీ ముకేష్ కు క్లాస్ పీకింది. వర్షిణి కూడా "ఇదే మీ రియాలిటీ" అనడంతో శివ "మీరిద్దరూ జీరో పర్సనాలిటీ" అంటూ ఊగిపోయాడు. మీలాంటి వాళ్లకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటమే నా తప్పు అంటూ శివ సీరియస్ అయ్యాడు.

ఇదే తరహా వల్గర్ మాటలతోనే గత వారం రోహిత్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. రోహిత్, ముకేష్ కలిసి అర్ధరాత్రి త్రిగుణ్ గురించి అసభ్యంగా మాట్లాడిన వీడియోను నాగార్జున స్వయంగా చూపించాడు. దాని తర్వాత హౌస్ మేట్స్ ఓటింగ్ లో 7 ఓట్లతో రోహిత్ ను బయటకు పంపారు. ఇప్పుడు అదే బాటలో ముకేష్ నడుస్తున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. "ముకేష్ ని బయటకు పంపేయండి బిగ్ బాస్, త్రిగుణ్ ఆదేశిస్తే బిగ్ బాస్ అమలు చేయాల్సిందే" అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కెప్టెన్ గా త్రిగుణ్ కు ఉన్న పవర్ తో ముకేష్ పై యాక్షన్ తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ముకేష్ తీరుపై నాగార్జున వీకెండ్ లో ఎలా స్పందిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో రోహిత్ విషయంలో నాగార్జున స్ట్రిక్ట్ గా వ్యవహరించాడు. ఇప్పుడు ముకేష్ విషయంలో కూడా అదే రూల్ వర్తిస్తుందా? లేక వార్నింగ్ తో వదిలేస్తాడా? అనేది చూడాలి.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com