ఆదిరెడ్డి పేరిట వచ్చే ఫేక్ న్యూస్ ని నమ్మకండి!
on Feb 26, 2024

కొందరు సాధారణ స్థాయి నుండి సెలబ్రిటీ హోదాకి వచ్చాక వారికి తెలియకుండా వారి పేరు మీద ఎన్నో ఫ్యాన్ పేజీలు పుడుతుంటాయి. అయితే ఫ్యాన్ పేజీలు అయితే పర్లేదు కానీ కొన్ని పేజీలు అతని పేరుతో ఫ్రాడ్ చేస్తుంటారు. బెట్డింగ్ ఆప్ లలో , కూపన్స్, రిజిస్ట్రేషన్ ఫీజు అంటు ఎంతోమంది తన పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి లింకులు పంపిస్తున్నారు వాటిని నమ్మకండి అంటు ఆదిరెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ద్వారా తెలిపాడు.
ఆదిరెడ్డి బిగ్ బాస్ తో ఫేమ్ లొకి వచ్చిన యూట్యూబర్.. అదిరెడ్డి బిగ్ బాస్ అంటే ఇష్టంతో.. ఇప్పటిదాకా జరిగిన అన్ని సీజన్లకి రివ్యూ ఇచ్చాడు. అతను ఇచ్చిన రివ్యూస్ కు లక్షల్లో వ్యూస్ వచ్చేవి అనడంలో ఆశ్చర్యమే లేదు. ఒక యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ లోకి కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత గీతు రాయల్ తో కలిసి మాస్టర్ మైండ్ ఆఫ్ ది హౌస్ గా ఉన్నాడు. తనకి వచ్చీ రాని డ్యాన్స్ తో హౌస్ లో నవ్వులు పూయించాడు. హౌస్ లో తన పర్ఫామెన్స్ కి టాప్ -5 లో ఉన్నాడు. హౌస్ నుండి బయటకొచ్చిన తర్వాత ఎన్నో వ్లాగ్స్ , పోస్ట్ లతో నెటిజన్లకి మరింత దగ్గరయ్యాడు.
ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ , ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా పేజీలలో ఎన్నో ఫేక్ న్యూస్ లు, వీడియోలు స్ప్రెడ్ అవుతుంటాయి. వాటిల్లో ఏవి నిజమో ఏవి అబద్దమో కొన్నిసార్లు తెలియకపోవచ్చు. అయితే అలాంటిదే ఇప్పుడు ఆదిరెడ్డికి ఎదురయ్యింది. తన పేరు మీద నార్త్ వాళ్ళు కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి బెట్టింగ్ చేస్తున్నారంట.. అలాంటి వాటిని నమ్మొద్దని తనకి ఒకే ఒక్క అకౌంట్ ఉందని.. అకౌంట్ కి బ్లూ టిక్ ఉంటుందని అనవసరంగా మీ డబ్బులని బెట్టింగ్ ఆప్స్ లో పెట్టి మోసపోకండి అంటు తన ఇన్ స్ట్రాగ్రామ్ పేజీలో ఓ పోస్ట్ చేసి తెలియజేశాడు. అది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



