Brahmamudi:అందరిముందు తన భర్తని తిట్టిన అనామిక.. జెలస్ ఫీలవుతున్న రాజ్ !
on Feb 26, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -342 లో.. శ్వేతని రాజ్ తీసుకొని.. కావ్య, తన బావని ఫాలో అవుతు వాళ్ళ వెనకాలే రెస్టారెంట్ కి వస్తారు. ఇక కావ్య వాళ్ళ బావ భాస్కర్ అక్కడే ఉన్న రాజ్ ని చూసి కావాలనే.. తను జెలస్ ఫీల్ అవ్వాలని వెయిటర్ తో చెప్పి కేక్ బొకే తెప్పిస్తాడు. తన భార్యకి ప్రపోజ్ చేయబోతున్నాడనే ఫీల్ కల్పించి రాజ్ కి కోపం వచ్చేలా చేస్తాడు. వాడు నా భార్యకి ప్రపోజ్ చేస్తున్నాడని శ్వేతతో రాజ్ అంటాడు. చేస్తే నీకేంటి నువ్వు వద్దనుకుంటున్నావు కదా.. తన బావతో అయిన హ్యాపీ గా ఉండనివ్వని శ్వేత అంటుంది.
.webp)
నేను ఇంకా డివోర్స్ తీసుకోలేదు అయిన అంత త్వరగా ఎలా రాంగ్ గా ఆలోచిస్తుంది. ఇది ఎలా ఆపాలని రాజ్ ఆలోచిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఉన్నా ప్లేస్ దగ్గరికి ఇందిరాదేవి, సీతారామయ్యలని భాస్కర్ రప్పిస్తాడు. వాళ్ళని అక్కడ చూసిన రాజ్.. ఇప్పుడు కావ్య నేను విడాకులు తీసుకుంటున్నట్లు తెలిస్తే కొంప మునుగుతుందని రాజ్ వెంటనే భాస్కర్, కావ్య ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్లి నిల్చొని ఉంటాడు. అప్పుడే ఇందిరాదేవి, సీతారామయ్య వచ్చి.. మీరు కూడా ఇక్కడికే వచ్చారా కావ్యకి వాలింటైన్ డే విషెస్ చెప్పడానికి తీసుకొని వచ్చావా అని ఇందిరాదేవి అనగానే.. అవునని రాజ్ అంటాడు. భాస్కర్ ఏదో చెప్పబోతుంటే నువ్వు అగని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ అందరి ముందు కావ్యకి వాలింటైన్ డే విషెస్ చెప్తాడు. కావ్య కూడ చెప్తుంది. ఇక్కడే ఉంటే వీడు కావ్యని మార్చేస్తాడని అనుకొని ఆఫీస్ లో వర్క్ ఉంది అంటు కావ్యని రాజ్ లాక్కొని వెళ్తాడు. ఆ తర్వాత రాజ్ జెలస్ ఫీల్ అవుతున్నాడని భాస్కర్, ఇందిరాదేవి, సీతారామయ్య నువ్వుకుంటారు.
.webp)
ఆ తర్వాత కావ్య, రాజ్ లు ఆఫీస్ కి వెళ్తుంటారు. ఏంటి ఇదంతా మీరే ప్లాన్ చేశారనుకున్నాను. పాపం మా బావ చేశాడా అని రాజ్ కి ఇంక కోపం వచ్చేలా కావ్య మాట్లాడుతుంది. ఆ తర్వాత అనామిక దగ్గరికి రుద్రాణి వచ్చి నువ్వు నీ భర్తని ఆఫీస్ కి పంపించావ్ కానీ అతను అక్కడ ఏం చేస్తున్నాడో చూడాలి కదా అని రుద్రాణి అనగానే.. అవును ఆంటీ అంటూ అనామిక కూడా ఆఫీస్ కి వెళ్తుంది. ఆ తర్వాత కావ్య వేసిన డిజైన్స్ బాలేవంటు రాజ్ చిరాకు పడుతాడు. తరువాయి భాగంలో అనామిక ఇంట్లో అందరి ముందు కళ్యాణ్ ని తిడుతుంది. ఆఫీస్ కి వెళ్లి అక్కడ కూడా కవిసమ్మేళనం చేస్తున్నాడని అనగానే.. కళ్యాణ్ కి సపోర్ట్ గా కావ్య మాట్లాడుతుంది. దాంతో నీ వల్లే ఇదంతా అని కావ్యని అనామిక అనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



