పెళ్లి తర్వాత తారక్ మారిపోయాడు!
on May 4, 2021
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిజజీవితంలో చాలా సరదాగా ఉంటారు. పెళ్లికి ముందు అయితే ఎన్టీఆర్ తో ఆ ఎంజాయ్మెంట్ వేరేలా ఉండేదని అంటున్నాడు నటుడు సమీర్. పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించిన సమీర్.. ఎన్టీఆర్ కి మంచి స్నేహితుడు. తాజాగా ఓ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీర్.. ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి, తోటి నటులతో ఆయన ప్రవర్తించే తీరుపై స్పందిస్తూ కొన్ని పర్సనల్ విషయాలను బయటపెట్టారు. స్నేహానికి విలువనిచ్చే ఎన్టీఆర్ ఇండస్ట్రీలోని చాలా మంది నటీనటులతో ఎంతో సన్నిహితంగా ఉంటారు.
వర్క్ విషయంలో ఎంత సీరియస్ గా ఉంటారో మిగతా సమయంలో అంతకంటే ఎక్కువ సరదాగా ఉంటారని.. ఆయనతో కలిసి పనిచేవాళ్లు చెబుతుంటారు. నటుడు సమీర్ కి కూడా తారక్ చేసే అల్లరి పనుల గురించి బాగా తెలుసు. తాజాగా వీటి గురించి కొన్ని కబుర్లు చెప్పారు. పెళ్లికి ముందు ఎన్టీఆర్ పలు రకాల పార్టీలు చేస్తూ ఇంట్లోనే ఎక్కువగా ఎంజాయ్ చేసేవారని సమీర్ అన్నారు. ఎన్నోసార్లు ఆ పార్టీలకు తమను కూడా ఆహ్వానించారని చెప్పారు. రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, రాఘవ వంటి ఆర్టిస్ట్ లకు వీకెండ్స్ లో తారక్ నుండి ఫోన్ వచ్చేదని.. పార్టీ చేసుకుందాం వెంటనే ఇంటికి రావాలని ఆయన చెప్పేవారని సమీర్ గుర్తుచేసుకున్నారు.
అయితే పెళ్లి తరువాత ఎన్టీఆర్ పార్టీలు మానేశారని చెప్పుకొచ్చారు. షూటింగ్ లో ఎన్టీఆర్ చాలా సరదాగా ఉంటారని.. ఎవరైనా తప్పు చేస్తే సరదాగా షర్ట్ విప్పించి షూటింగ్ లో అలాగే ఉంచేవారని.. ఆయన ఇచ్చే పనిష్మెంట్ చాలా సరదాగా ఉండడంతో.. ఎవరికీ కోపం వచ్చేది కాదని తెలిపారు. ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ నటుడిని ఎక్కడా చూడలేదని.. అయితే ఎన్టీఆర్ చేసే అల్లరి పనుల వలన రాజమౌళితో తిట్లు పడిన సందర్భాలు ఉన్నాయని సమీర్ చెప్పుకొచ్చారు.
Also Read