శ్రీముఖి ప్లీజ్ డాన్స్ చేయొద్దు..మా ఆయన నీ డాన్స్ చూసి మెస్మోరైజ్ ఐపోతున్నాడు
on Apr 5, 2025
శ్రీరామనవమి పండగ స్పెషల్ కాన్సెప్ట్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం రాబోతోంది. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఇష్మార్ట్ జోడీస్ ఎంట్రీ ఇచ్చారు. రాకేష్ - సుజాత, యష్ - సోనియా, ప్రేరణ - శ్రీపద్, ప్రదీప్ - సరస్వతి, లాస్య - మంజునాథ్ వీళ్లంతా వచ్చారు. వీళ్ళతో టాస్కులు ఆడించింది శ్రీముఖి. ఐతే ఇందులో ఒక టాస్క్ లో నేల మీద ఒక క్లాత్ వేసి దాని మీదనే వైఫ్ అండ్ హజ్బెండ్ ని నిలబెట్టి డాన్స్ చేయించింది. ఇకపోతే సోనియా శ్రీముఖిని పాపం ఒక రిక్వెస్ట్ చేసింది. "శ్రీముఖి గారు నా నుంచి ఒక రిక్వెస్ట్ మీరు అంత మంచిగా డాన్స్ చేయొద్దు...యష్ మీ డాన్స్ ని చూసి మెస్మోరైజ్ ఐపోయాడు..సో" అని చెప్పుకొచ్చింది.
దాంతో శ్రీముఖి షాకైపోయింది. వెంటనే రాకేష్ అందుకున్నాడు.."పాపం యష్ రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల ఆవిడను తప్ప అందరినీ చూస్తున్నాడు అదేంటో మరి" అన్నాడు. దానికి సోనియా, యష్ నవ్వేశారు. ఇక ఈ జోడీల్లో భర్తలను ఒక అట్ట పెట్టెల్లో పెట్టేసి భార్యలకు తమ తమ భర్తలను కనుక్కోవాలి అంటూ ఒక టాస్క్ ఇచ్చింది. అందులో లాస్య మంజునాథ్ ఓడిపోయారు. ఇక పాపం వాళ్ళు ఈసారి ఫీలైనట్టే అనిపించినా ఇది అలవాటే మాకు అంటూ నవ్వుకున్నారు. ఎందుకంటే ఇష్మార్ట్ జోడిలో పాపం వాళ్ళే మొదటిసారి ఎలిమినేట్ ఐపోయి వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చి మళ్ళీ ఎలిమినేట్ ఇపోయారు. ఇక ఆదివారం విత్ స్టార్ మా పరివారం కూడా అలాగే ఇప్పుడు జరిగేసరికి ఎలిమినేషన్ కి పాపం వాళ్ళు అలవాటు పడిపోయి పోన్లే అనేసుకున్నారు. అలాగే భయాలకు భర్తలు తినిపించే టాస్క్ కూడా ఇచ్చింది శ్రీముఖి. ఇలా శ్రీరామా నవమి రోజున ఎన్నో టాస్కులతో ఇష్మార్ట్ జోడి జంటలు వచ్చి ఆడియన్స్ ని అలరించబోతున్నాయి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
