ఎనిమిదేళ్లుగా ఒకతన్ని ప్రేమిస్తున్నా.. మా అమ్మానాన్నలకు కూడా తెలీదు!
on Sep 24, 2022

టిక్ టాక్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో భాను ఒకరు. దానివల్లే ఆమెకు స్మాల్ స్క్రీన్ పై అవకాశం వచ్చింది. టిక్ టాక్ వీడియోస్ తో పాపులర్ అయిన భానుని.. హైపర్ ఆది ‘జబర్దస్త్’ షోలోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో చాలా స్కిట్లు, డ్యాన్స్ ఫెర్ఫామెన్సులు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.
కానీ కొన్నాళ్లుగా ఈమె జబర్దస్త్‌లో కనిపించడం లేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజీపై సందడి చేసింది. వర్షతో కలిసి అదిరిపోయే పాటకు హాట్ హాట్ గా డ్యాన్స్ కూడా చేసింది. వీళ్ళ డాన్స్ చూసి "మీ నడుముల్ని బాగా మెలికలు తిప్పారుగా" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది ఇంద్రజ.
ఇందులో భాను తన లవ్ స్టోరీ గురించి బయటపెట్టింది. "ఎనిమిదేళ్లుగా ఓ వ్యక్తిని ఇష్టపడుతున్నాను కానీ ఆ విషయం అమ్మనాన్నలకు కూడా తెలియదు" అని చెప్పింది. మరి భాను ప్రేమిస్తున్న అతనెవరు? జబర్దస్త్ లో చేస్తున్నతనా లేక, బయటి వ్యక్తా?.. అనేది తెలియాలంటే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ఎపిసోడ్ కోసం కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



