నన్ను బ్యాడ్ చేయకు.. పాయింట్ ఉంటే నామినేషన్ చేస్కో..
on Nov 17, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో తనూజ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ దత్తపుత్రిక అని అందరికి తెలుసు. అందుకే హౌస్ లో ఎంతమంది ఉన్నా తన గురించి పాజిటివ్ గా మాత్రమే కంటెంట్ బయటకు వస్తుంది. అంతలా తనని ఎంకరేజ్ చేస్తున్నారు బిగ్ బాస్. అయితే నిన్నటి ఎపిసోడ్ లో తనూజ, ఇమ్మాన్యుయల్ మధ్య గొడవ జరిగింది.
ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమ్ అనేది ఒక్కొక్క చోట పనికొస్తది కానీ అన్ని చోట్లా కాదు. ప్రతిసారీ నువ్వు అదే చేస్తున్నావ్. ఎందుకంటే నాకు నీకు బాండింగ్ అని కాదు ఒక ఫ్రెండ్‌షిప్ అని కాదు. ఒక హౌస్‌మేట్స్‌గా కూడా మన మధ్య ఏం లేదు. మరి నేను నీకు బలహీనత ఎలా అవుతానంటూ తనూజ అడిగింది. నువ్వు ఏమైనా అంటే పర్సనల్‌గా నేను ఫీలవుతాను.. నా వీక్‌నెస్ అది అని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. ఇంతలో పక్కనే ఉన్న రీతూ మధ్యలో మాట్లాడింది. వాడు నాకు ఆల్‌మోస్ట్ టూ థ్రీ టైమ్స్ చెప్పాడు ఏంటంటే రీతూ మనద్దిరం ఫ్రెండ్స్ బయట చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోతే నాకంటే వాడికి నువ్వే ఎక్కువరా అని తనూజతో రీతూ చెప్పింది. ఎక్కువ తక్కువ కాదు రీతూ.. వాడు ప్రతి గేమ్‌లో నిజాయితీగా, హృదయపూర్వకంగా సపోర్ట్ చేసి వాడు గెలవాలని చూస్తుంది నేను.. ఆ థ్రీ వీక్స్ తర్వాత మేము మాములుగా కూర్చొని మాట్లాడుకున్నదే లేదు.. నేను వచ్చి కూర్చుంటే నువ్వు లేచి వెళ్లిపోతున్నావ్.. లేదంటే నువ్వు వచ్చి కూర్చుంటే నాకు ఏదో వర్క్ వచ్చి నేను వెళ్లిపోతున్నానంటూ తనూజ చెప్పింది. నీకు అది లేదేమో కానీ నాకు ఆ బాండ్ ఉంది తనూజ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు.
నాకు ఎక్కడా కనిపించలేదు ఇమ్మూ అంటూ తనూజ అడుగగా.. కనిపించడం అంటే నీ పక్కన వచ్చి కూర్చొని మాట్లాడేది కాదని ఇమ్మాన్యుయల్ అన్నాడు. మరి ఏ విషయంలో ఉంది చెప్పు అని తనూజ అడుగగా.. అన్ని విషయాల్లోనూ కనెక్ట్ అయ్యే ఉన్నానని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. ఏది ఒక్క విషయం చెప్పు అంటూ తనూజ అంది. దీంతో సరే నేను ఏ విషయంలోనూ లేనులే తనూజ.. నేను కనెక్ట్ అవ్వలేదంటూ ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఇప్పుడు నాకు తెలుసుకోవాలనుంది చెప్పు అని మళ్లీ తనూజ అడిగేసరికి లేదులే నేను కట్ అయిపోయానంటూ ఇమ్మాన్యుయల్ అనేశాడు. మళ్లీ ఇక్కడ సేఫ్ మాటలా అంటూ తనూజ అనగా.. సరే అవును నేను సేఫ్‌యే.. అంటూ ఇమ్మాన్యుయల్ అన్నాడు.
తనూజ వెళ్లగానే రీతూతో ఇమ్మాన్యుయల్ మాట్లాడాడు. ఇక మళ్ళీ ఇమ్మాన్యుయల్ దగ్గరికి వచ్చింది తనూజ. నువ్వు ప్రతీచోట నా పేరు తీసుకొని నన్ను బ్యాడ్ చేయకు ఇమ్మాన్యుయల్.. నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా.. అడుక్కుంటున్నా.. ఏదో నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నట్లు.. ఏదో నువ్వు నా మీద ప్రేమ చూపిస్తున్నట్లు చేయకు.. నీ గేమ్ నువ్వు ఆడేటప్పుడు నీ గేమ్ నువ్వు ఆడు.. ప్లీజ్ నా పేరు నువ్వు తీసుకోకంటూ తనూజ అంది. నేను బ్యాడ్ చేయడం లేదని ఇమ్మాన్యుయల్ చెప్తుంటే వద్దు ప్లీజ్ నా పేరు తీయకంటూ తనూజ అంది. సారీ తనూజ.. నీ పేరు తీసుకురాను అని ఇమ్మాన్యుయల్ అనగా.. పాయింట్ ఉంటే నామినేషన్ చేస్కోమని తనూజ చెప్పేసి వెళ్ళిపోయింది. అయితే ఇందులో అసలేం లేదు.. తనూజ కంటెంట్ కోసమే ఇది చేసిందని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



