Gourav Gupta Elimination: గౌరవ్ ఎలిమినేషన్.. బయటకు రావడానికి కారణాలివే!
on Nov 17, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో మోస్ట్ కాంప్లెక్స్ థింగ్ ఏంటంటే అది గౌరవ్ తో తెలుగులో ఓ పది నిమిషాలు మాట్లాడటమే.. ప్రతీసారీ ఇతనికి ఇంగ్లీష్ టూ తెలుగు ట్రాన్స్ లేషన్ కావాల్సి వచ్చేది. అయితే పదో వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని నాగార్జున బిగ్ బాంబ్ పేల్చాడు.
నిన్నటి సండే ఎపిసోడ్ లో మొదటగా తనూజ, ఇమ్మాన్యుయల్ మధ్య జరిగిన గొడవని చూశాడు నాగార్జున. ఆ తర్వాత వారిద్దరిని టీమ్ లీడర్స్ గా చేసి గేమ్ ఆడించాడు నాగార్జున. ఆ తర్వాత నాగ చైతన్య స్టేజ్ మీదకి వచ్చి తను హైదరాబాద్ కార్ రేసింగ్ కి ఓనర్ ని అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత స్పాన్సర్ టాస్క్ ఆడించాడు నాగార్జున. ఇక ఎపిసోడ్ చివరిలో డేంజర్ జోన్‌లో ఉన్న దివ్య-గౌరవ్ ఇద్దరిని ఎలిమినేషన్ రౌండ్ ఆడించాడు. ఇందులో దివ్య సేఫ్ అయి గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే తనూజ దగ్గరున్న సేవింగ్ పవర్ ఈ వారంతో ఎక్స్‌పెయిర్ అవుతుంది. దీంతో అది ఉపయోగిస్తావా అంటూ నాగార్జున అడిగాడు. ఒకవేళ ఉపయోగిస్తే ఓట్ల ద్వారా సేవ్ అయిన దివ్య ఎలిమినేట్ అయి గౌరవ్ సేఫ్ అవుతాడని నాగార్జున చెప్పాడు. కానీ తనూజ ఆలోచించి ఆడియన్స్ ఓటింగ్‌కి గౌరవం ఇస్తున్నాను సర్. గోల్డెన్ పవర్ వాడటం లేదని చెప్పింది. దీంతో గౌరవ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఆ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన గౌరవ్ కి తన జర్నీ వీడియో చూపించాడు నాగార్జున. ఇక హౌస్ లో ఎవరు ఎలాంటివారో చెప్పమన్నాడు నాగార్జున. గౌరవ్ ఒక్కొక్కరి గురించి చెప్పాక తనని పంపించేశాడు.
రమ్య, మాధురి, సాయి, అయేషా, గౌరవ్ , నిఖిల్ మొత్తం ఆరుగురిని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి పంపగా నిఖిల్, గౌరవ్ మినహా మిగతావాళ్ళంతా ఎలిమినేట్ అయ్యారు. నిఖిల్ శనివారం నాటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ కాగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అంతా ఎలిమినేషన్ అయ్యారు. హౌస్ లో ప్రస్తుతం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



