రెండు ఇడ్లి 1200 .. పచ్చళ్ళ కంటే కాస్ట్ గా ఉన్నాయి..
on Apr 22, 2025
.webp)
సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి అంబటి అర్జున్ తో పాటు ప్రియాంక జైన్, శోభా శెట్టి, సుహాసిని వచ్చారు. ఐతే నిన్న మొన్నటి వరకు రచ్చ చేసిన అలేఖ్య చిట్టి పికిల్స్ కాన్సెప్ట్ ని ఈ షోలో కూడా వాడేశారు. ఐతే సుమ అడ్డా షోలో "సుమ టిఫిన్స్ అండ్ కర్రీ పాయింట్" పేరుతో ఒక స్కిట్ వేశారు. ఇందులో సుమ కూడా మాములుగా జోక్స్ వేయలేదు. "ఈ ఇడ్లీ గనక మీరు తిన్నారు అనుకో మీ ముఖం కూడా ఇడ్లీలా నిగనిగలాడిపోతుంది అంతే. రెండు ఇడ్లి 1200 అమ్మా" అంటూ సుమ మంచి జోష్ తో డైలాగ్ వేసింది.
దానికి అంబటి అర్జున్ వచ్చిన "ఏంటో వీళ్ళ ఇడ్లి పచ్చడి కన్నా కాస్ట్ గా ఉంది..ఆ పచ్చడి కొనలేకే మీ టిఫిన్ తిందామని వచ్చాను..టిఫిన్ కూడా ఇంత కాస్ట్లీ గా చెప్తుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి" అంటూ చిట్టి పికిల్స్ మీద సెటైర్స్ వేసాడు. ఆ తర్వాత సుహాసిని వచ్చి "ఏంటి ఈ దోశ ఇంత గట్టిగా ఉంది" అని అడిగింది. దానికి సుమ " మేము దోశలు వేసేసిన తర్వాత వాటిని డైరెక్ట్ గా తీసుకువెళ్లి గేట్ మీద ఆరేస్తాం" అనేసరికి అందరూ నవ్వేశారు. ఇంతలో స్కిట్ లో ఉన్న ఇంకో కమెడియన్ "అంటే ఎవరో చెప్పారు మన హోటల్ లో దోస తింటే బాగా డాన్స్ వస్తుందట" అన్నాడు. దానికి సుమా "అవును రా అంటూ దోశ, చట్నీ పెట్టింది సుమా. అది తిన్న వెంటనే అతను మైకేల్ జాక్సన్ స్టెప్పులేసి కింద పడిపోయాడు. దాంతో అందరూ నవ్వేశారు. ఐతే ఈ వారం ప్రతీ స్కిట్ లో కూడా పచ్చళ్ళు కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక ఈ షోకి రాగానే శోభా శెట్టి, ప్రియాంక జైన్ కలిసి కొబ్బరి మామిడిని ఇలా తినాలి అంటూ ఇద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. దానికి సుమ ఐతే ఈ మధ్య ఏ పనీ తిన్నగా చేయట్లేదా అని సెటైర్ వేసింది. ఇలా ఈ షో మొత్తం సెటైర్స్ కనిపిస్తూనే ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



