Karthika Deepam2: శౌర్యని ఆయుధంగా మార్చుకున్న జ్యోత్స్న.. కార్తీక్ కి డౌట్!
on Apr 23, 2025
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 338లో.. దశరథ్‌కి తెలియకుండా కోర్టు వ్యవహారాలు సాగాలని శివన్నారాయణ నిర్ణయం తీసుకుంటాడు. బావా.. తప్పు జరిగింది.. అది నిజం.. దయచేసి దీపను కాపాడే ప్రయత్నం చేసి.. నువ్వు ఇంకా విలన్ కాకు అని కార్తీక్ తో జ్యోత్స్న అంటుంది. ఆ మాటలు చాటుగా విన్న శౌర్యకు అనుమానం వస్తుంది. అమ్మను నాన్న కాపాడటం ఏంటీ? ఈ విషయం వెంటనే కాశీ మావయ్యను అడగాలని శౌర్య ఫిక్స్ అయ్యి ఇంట్లోంచి దొంగచాటుగా పరుగుతీస్తుంది. ఇక జ్యోత్స్నని కార్తీక్ కోప్పడి పంపేసి సైకిల్ మీద కోర్టుకి బయల్దేర్తాడు. మరోవైపు దశరథ్ నిద్రపోతుంటే సుమిత్ర అక్కడే ఉండి అతడ్ని చూస్తుంటుంది. పక్కనే ఉన్న పారిజాతం.. సుమిత్రా నువ్వు కూడా కాసేపు రెస్ట్ తీసుకోమని అంటుంది.
ఇంతలో శివన్నారాయణ వచ్చి.. అమ్మా సుమిత్రా మనం కోర్టుకి వెళ్లాలి.. ఇప్పుడే బయల్దేరాలి. అక్కడకి దీపను తీసుకొస్తున్నారట.. మనం సాక్ష్యం చెప్పాలి. అలాగే ఈ కోర్టు వ్యవహారాలన్నీ దశరథ్‌కి తెలియకూడదు ఇక.. పారిజాతం నువ్వు ఏం చెప్పకు అనేసి ఇద్దరినీ తీసుకుని కోర్టుకి బయలుదేర్తాడు.
ఇక శౌర్య రోడ్ల మీద తిరుగుతుంటే జ్యోత్స్న చూస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావని జ్యోత్స్న అడుగగా.. నేను మా కాశీ మావయ్య ఇంటికి వెళ్తున్నా జ్యో.. మా అమ్మ కోసం వెళ్తున్నా.. కానీ మా అమ్మ ఎక్కడుందో నీకు తెలుసు.. మా నాన్నకు చెబుతుంటే నేను విన్నాను.. మా అమ్మ ప్రమాదంలో ఉందని అర్థమైంది. మళ్లీ బూచోడు వచ్చాడా? చెప్పు జ్యో.. నన్ను తీసుకెళ్లవా మా అమ్మ దగ్గరకి అంటూ శౌర్య రిక్వెస్ట్ చేస్తుంది. వ్వు ఇంట్లోంచి బయటికి వచ్చేటప్పుడు ఎవరైనా చూశారా అని జ్యోత్స్న అడుగుతుంది. ఎవరికీ చెప్పకుండా వచ్చానని శౌర్య అంటుంది. కాసేపటికి దీపని పోలీస్ వ్యాన్ లో ఎక్కిస్తుంటారు. అప్పుడే అక్కడికి శౌర్య వస్తుంది. అమ్మా అంటూ పరుగున వెళ్ళి దీపని పట్టేసుకుంటుంది శౌర్య. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని దీప అడుగగా.. అమ్మా నీకోసమే వచ్చాను.. నువ్వు ఇక్కడున్నావేంటీ.. పోలీసులు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారని శౌర్య అడుగుతుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. రౌడీ ఇక్కడున్నావేంటని అడుగుతుంది. నువ్వు నాతో మాట్లాడకు.. నాకు నువ్వు అబద్ధం చెప్పావ్.. అమ్మ ఇక్కడుందని జ్యో నాకు చెప్పిందంటూ శౌర్య షాకిస్తుంది. దీప ఏడుస్తూ ఉంటే.. శౌర్య ఏడుస్తూనే.. అమ్మా తప్పు చేస్తేనే కదా పోలీసులు తీసుకెళ్తారు. నువ్వేం తప్పు చేశావ్.. ఏం జరిగిందని ఆరా తీస్తుంది. ఇక కార్తీక్ సర్దిచెప్తున్నంత సేపు.. నాన్నా నీ మాట ఇక నమ్మనంటూ దీప చేయిపట్టుకుని.. అమ్మరా వెళ్లిపోదామని అంటుంది. లావణ్యా ఏంటి ఇది అని ఎస్ఐ అరుస్తాడు. సర్ మీరు కారు ఎక్కండి.. రెండు నిమిషాలు సర్.. చిన్నపిల్ల కదా లావణ్య అంటుంది. ఇక దీప, శౌర్యల మధ్య సెంటిమెంట్ సీన్ సాగుతుంది. కాసేపటికి దీప వెళ్ళిపోతుంది. అమ్మని తీసుకొస్తానంటూ శౌర్యకి కార్తీక్ మాటిస్తాడు.
మరోవైపు పారిజాతం, సుమిత్ర, శివన్నారాయణ కారు మీద వెళ్తూ వెళ్తూ.. దీపను వదిలిపెట్టకూడదని ఫిక్స్ అవుతారు. అది బయటికి వస్తే జ్యోత్స్నను బతకనివ్వదు. దాన్ని వదిలిపెట్టకూడదు.. ఉరితాడు వేలాడాల్సిందే అని పారిజాతం చెప్తుంది. ఇక కాసేపటికి కోర్టు దగ్గర కావేరీ, కార్తీక్ ఇద్దరు వచ్చి దీప కోసం ఎదురుచూస్తుంటారు. ఆ రోజు నువ్వు ఈ నిజం నాకు చెప్పి ఉంటే సరిపోయేది చిన్నమ్మా అని కార్తీక్ అంటాడు. దీప గన్ పట్టుకోవడం ఏంటీ.. బుల్లెట్ దశరథ్ గారికి తగలడమేంటి? అయినా ఆ జ్యోత్స్న ముందే అంది.. నీ జీవితంలో దీపను ఉండనివ్వనని కాంచన అంటుంది. అంటే నేను చూసిన దానికి.. మావయ్యకు బుల్లెట్ తగలడం మధ్య ఇంకేమైనా జరిగిందా అని కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఇంతలో దీపను పోలీసులు తీసుకొస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



