నాని నేను సమీరాని...సమంత అనుకుని కన్ఫ్యూజ్ కావొద్దు...
on Apr 16, 2025
.webp)
సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి సమీరా భరద్వాజ్, ఆర్పి. పట్నాయక్, రఘు కుంచె, అనుదీప్ వచ్చారు. రాగానే సుమ అందరికీ గ్లాసుల్లో మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఐతే అందులో ఒక ఈగ అటు ఇటు గ్లాసులోకి దూరకడానికి ఎగురుతూ ఉంది. దానికి సుమ కౌంటర్ వేసింది. "నాని, నాని ఈ ఎపిసోడ్ కి కాదు వేరే ఎపిసోడ్ కి కాదు" అంటూ సుమా అనేసరికి దానికి సమీరా కూడా రికౌంటర్ వేసింది. "నాని నేను సమంత అనుకుని కన్ఫ్యూజ్ కావొద్దు ప్లీజ్" అని చెప్పేసరికి సుమ ఒక్కసారిగా షాకయ్యింది.
ఇంతలో సుమ ఆడియన్స్ ని చూస్తూ "ఏ టీమ్ వీళ్లకు సపోర్ట్ చేయాలి" అని చెప్తూండే సరికి సమీరా టేబుల్ మీద డబ్బులు తీసి ఎవరికీ తెలీకుండా పాకెట్ లో పెట్టేసుకుంది. ఇంతలో సుమ చూసి "వ్వాట్ ఈజ్ థిస్ దోపిడీ " అంది..అనేసరికి అందరూ నవ్వేశారు. ఇంతలో ఆర్పి గారు మాట్లాడి "ఇలా దొంగతనం చేసినప్పుడు వాళ్లకు మైనస్ చేసి మాకు ప్లస్ చేసే అవకాశం ఏమన్నా ఉందా" అని అడిగారు. సుమ "లేదండి..అలాంటి రూల్స్ ఏమీ లేవండి " అనేసింది. "ఐతే ఇప్పుడు పెట్టండి" అంటూ ఆర్పీ అడిగారు. తర్వాత సమీరాతో పాటలు పాడించింది సుమ. అలాగే ఒక పాటను శృంగార రసంలో పాడించింది. అలాగే రఘు కుంచెతో పాడిద్దామని చూసింది. "ఏంటి బాగా శృంగార రసం విని" అనేసరికి అందరూ పడీ పడీ నవ్వారు. "రఘు గారికి ఇవ్వాల్సింది కదా శృంగార రసం" అంది సమీరా. దానికి సుమ "రఘు గారి పాటలన్ని శృంగార రసంలోనే ఉంటాయి" అంది. ఆ తర్వాత రఘు కుంచెతో పాటలు పాడించింది. అలాగే ఆర్పీ కూడా "వానా వానా వానా" సాంగ్ ని పాడారు. దానికి సుమ పక్కన ఉన్న వ్యక్తి "వాన పడితే మేడం మేకప్ పోతుంది" అంటూ డైలాగ్ వేసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



